‘పరుగు’ కాంబినేషన్‌లో మరో చిత్రం?

Stylish Star Allu Arjun To Join Hands With Bommarillu Bhaskar After Parugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హిట్ చిత్రాల జాబితాలో ‘పరుగు’కి కూడా స్థానం ఉంది. 2008 వేసవిలో విడుదలైన ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. తొలుత యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. క్రమంగా విజయవంతమైన చిత్రాల జాబితాలో చేరిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే, ‘పరుగు’ సక్సెస్‌ఫుల్ మూవీ అనిపించుకున్నా.. బన్నీ, దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కాంబినేషన్‌లో మరో సినిమా రాలేదు. త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరనుందని సమాచారం.

ఆ వివరాల్లోకి వెళితే.. స్వల్ప విరామం అనంతరం భాస్కర్.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం కోసం మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని గీతా ఆర్ట్స్ సంస్థ సమర్పిస్తోంది. నిర్మాణ దశలోనే ఈ సినిమాకు మంచి బజ్ రావడం.. అవుట్ పుట్ కూడా బాగుండడంతో గీతా ఆర్ట్స్ సంస్థ భాస్కర్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తోందట. అన్నీ కుదిరితే బన్నీ కాంబినేషన్‌లో ఈ సినిమా ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. త్వరలోనే బన్నీ, భాస్కర్ కాంబినేషన్ మూవీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరి.. ‘పరుగు’ తర్వాత అల్లు అర్జున్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కాంబోలో రాబోయే చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.