మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ హక్కుల్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ‘సాహో’ ఫేమ్ సుజీత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ రీమేక్ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా దర్శనమివ్వనున్నాడని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘లూసిఫర్’ కోసం ఆ చిత్ర దర్శకుడు, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ ముఖ్య భూమిక పోషించాడు. మోహన్ లాల్‌కి నమ్మినబంటుగా ఉండే జాయద్ మసూద్ పాత్రలో పృథ్వీ నటన సినిమాకే ప్రత్యేకాకర్షణగా నిలిచింది. కాగా, తెలుగులో ఈ పాత్రకి బన్నీ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్‌తో పాటు చిరు కూడా భావిస్తున్నారట. అదే సమయంలో బన్నీ కూడా ఈ పాత్రలో నటించడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం.




గతంలో చిరు కథానాయకుడుగా నటించిన ‘విజేత’, ‘డాడీ’, ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రాల్లో తళుక్కున మెరిసాడు బన్నీ. ఈ నేపథ్యంలో.. సుదీర్ఘ విరామం తరువాత చిరుతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుండడం ఆసక్తి కలిగించే అంశమే. త్వరలోనే బన్నీ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























