కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Stylish Star Allu Arjun

ట్యాగ్ · 107 కథనాలు · పేజీ 6

ICON Movie Team Clears The Rumours
సినిమా వార్తలు

బన్నీ 'ఐకాన్' పై రూమర్లకు చెక్..!

మొత్తానికి రూమర్లకు చెక్ పెట్టారు బన్నీ 21 చిత్రయూనిట్. ఇన్నిరోజులు ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఒక్క పోస్టర్ తో గాసిప్ రాయుళ్ల నోర్లు మూయించారు. బ‌ర్త్‌డే విషెష్ చెబుతూ ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసింది. పోస్ట‌ర్ పాత‌దే... మళ్ళీ పోస్ట్ చేసి ఈ సినిమా ప‌క్క‌న పెట్టలేదన్న క్లారిటీ ఇచ్చారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బన్నీ కి జంటగా నటించేది ఎవరు అలాగే మిగితా నటీనటులు వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Stylish Star Allu Arjun Completes 17 Years In Tollywood
సినిమా వార్తలు

అల్లు అర్జున్ సినీకెరీర్ లో 17 సంవత్సరాలు పూర్తి

సూపర్ హిట్ "విజేత ", "స్వాతిముత్యం " మూవీస్ లో బాలనటుడిగా నటించిన అల్లుఅర్జున్ "డాడీ " మూవీ లో అతిథి పాత్రలో నటించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు 100వ సినిమా గా రూపొందిన "గంగోత్రి " మూవీ తో టాలీవుడ్ కు అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ మూవీ 2003 సంవత్సరం మార్చి 28 వ తేదీ రిలీజ్ అయ్యి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ రోజు తో అల్లు అర్జున్ తన సినీకెరీర్ లో 17 సంవత్సరాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్నారు.

Team TFNవాట్సాప్
Allu Arjun Donates 1.25 Crore To Combat The Spread Of Corona Virus
సినిమా వార్తలు

అల్లు అర్జున్ భారీ విరాళం... కేరళకు కూడా

కరోనా ను అరికట్టేందుకు గానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఇళ్లల్లో నుండి బయటకు రావొద్దని చెపుతూనే... ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ఇంకా వేడి నీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు మన టాలీవుడ్ హీరోలు కూడా తమ వంతు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నితిన్త, పలువురు డైరెక్టర్స్ విరాళాలు ప్రకటించగా.... ఇప్పుడు వీరి ఖాతాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. తనవంతుగా మొత్తం రూ.1.25 కోట్ల సాయాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు.

TFN Adminవాట్సాప్
Stylish Star Allu Arjun - Sukumar New Movie All Set To Release For Dussehra,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Allu Arjun - Sukumar New Movie,Stylish Star Allu Arjun,Sukumar,Allu Arjun Next Pro
సినిమా వార్తలు

ద‌సరా బ‌రిలో అల్లు అర్జున్ - సుకుమార్ చిత్రం?

`అల వైకుంఠ‌పుర‌ములో` చిత్ర‌ ఘ‌న‌విజ‌యం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఒక‌వైపు ఆ విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే.. మ‌రోవైపు కొత్త చిత్రంపై దృష్టి సారించాడు బ‌న్నీ. త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఇప్ప‌టికే ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుంది. కాగా, నెక్స్ట్ షెడ్యూల్ ని మ‌రో ప‌ది రోజుల్లో ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. కేర‌ళ‌లో 40 రోజుల పాటు నిర‌వ‌ధికంగా జ‌రిగే ఈ భారీ షెడ్యూల్ లో సింహ‌భాగం చిత్రీక‌ర‌ణని పూర్తి చేయ‌నున్నార‌ని స‌మాచారం. అంతేకాదు.. విజ‌య‌ద‌శ‌మి బ‌రిలో సినిమాని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు…

Team TFNవాట్సాప్
Allu Arjun 20 Team Heads To Kerala For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

అల్లు అర్జున్ 20... కేర‌ళ‌లో 40 రోజుల భారీ షెడ్యూల్

`అల వైకుంఠ‌పుర‌ములో`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఒక వైపు ఆ విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే.. మ‌రో వైపు కొత్త చిత్రంపై దృష్టి సారించాడు. త‌న ల‌క్కీ డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందిస్తున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బ‌న్నీ రెండు విభిన్న పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ ఇన్ ఫ‌ర్మేష‌న్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నితిన్ కి డబుల్ కంగ్రాట్స్

''అ ఆ'' లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత ‘లై’, ‘ఛల్ మోహన్ రంగ’, ‘శ్రీనివాస కళ్యాణం’తో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్నాడు నితిన్. దీంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'భీష్మ' సినిమాతో వచ్చాడు. ఇక ఈ నెల 21వ తేదీన విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కామెడీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్-రష్మిక జోడి, డిఫరెంట్ కంటెంట్, కామెడీ ఇలా అన్నీ ఈ సినిమాకు కలిసిరావడంతో అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు యూఎస్ లోను తన జోరు చూపుతోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

భ‌లేగా ప్లాన్ చేసిన బ‌న్నీ

ప్ర‌స్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. వీటిలో ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ మూవీ సెట్స్‌పై ఉండ‌గా... సుకుమార్‌, వేణుశ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న చిత్రాలు త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నున్నాయి. అంతేకాదు... ఈ మూడు సినిమాల‌ను ఏడాది గ్యాప్‌లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడ‌ట బ‌న్నీ.

Team TFNవాట్సాప్

షేర్