కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Stylish Star Allu Arjun

ట్యాగ్ · 107 కథనాలు · పేజీ 4

Stylish Star Allu Arjun Finds Place In 2020 Most Influential Young Indians List,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Stylish Star Allu Arjun,Allu Arjun,Hero Allu Arjun,Actor Allu Arjun,Allu Arjun La
సినిమా వార్తలు

2020 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్‌ ఇండియన్స్‌ లిస్ట్‌లో అల్లు అర్జున్

ఎప్పడూ ఏదో ఒక సర్వే జరుగుతూనే ఉంటుంది. అందులో మన సెలెబ్రిటీస్ చోటు దక్కించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. 2020 మోస్ట్‌ ఇన్‌ఫ్లూయన్స్ యంగ్‌ ఇండియన్స్‌ లిస్ట్‌లో అల్లు అర్జున్ చోటు దక్కించుకోవడం గొప్ప విషయం. 2020లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 25 మంది‌ వ్యక్తులను జిక్యూ ఇండియా ప్రకటించింది. అందులో అల్లుఅర్జున్ కూడా చోటు దక్కించుకున్నాడు. దానికి కారణం మరేదో కాదు 'అల వైకుంఠపురములో' సినిమానే. త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో తెలుసు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశాలు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బన్నీ కార్‌వాన్‌కు ప్రమాదం

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో 'పుష్ప' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్నట్టు పుష్ప టీం ఈరోజే ప్రకటించింది. మారేడు మిల్లి, రంపచోడవరంలలో ఇప్పటివరకూ షూటింగ్ జరుపుకుంది. ఇక షూటింగ్ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్వాన్‏ కు ప్రమాదం జరిగింది. ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఒక లారీ వచ్చి ఢీకొట్టడంతో వెనుక భాగం దెబ్బతింది. అయితే కార్వాన్ లో ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'పుష్ప' రెండు షెడ్యూల్స్ పూర్తి

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'పుష్ప'. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్‌ అనే లారీ డ్రైవర్‌ పాత్రలో ఫుల్ మాస్, రఫ్ అండ్ రస్టిక్ లుక్ లో కనిపించనున్నాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'పుష్ప' రిలీజ్ డేట్ ఫిక్స్

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇప్పటివరకూ ఆర్య, ఆర్య2 రాగా.. ఇప్పుడు మూడోసారి 'పుష్ప' సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో లారీ డ్రైవర్‌గా కనబడనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. ఈ షెడ్యూలు తరువాత హైదరాబాద్.. దాని తరువాత కేరళలో మరో షెడ్యూలు జరుపుకోనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అల్లు అర్జున్ డ్యాన్స్ కు అభిమాని

"ఆర్య ", "దేశముదురు", "బద్రినాథ్ ", "రేసుగుర్రం ", "సరైనోడు ", "దువ్వాడ జగన్నాథం ", "అల .. వైకుంఠపురములో .. " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ తన డ్యాన్స్ , స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అల్లు అర్జున్ తెలుగు , మలయాళ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులను డబ్బింగ్ మూవీస్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్ గా పేరు పొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ లో…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులు , ఫాలోవర్స్ కు థ్యాంక్స్ - అల్లు అర్జున్

సక్సెస్ ఫుల్ "విజేత "(1985) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ "గంగోత్రి " మూవీ తో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ "ఆర్య " మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని స్టైలిష్ హీరోగా పేరు పొందారు. 2020 సంవత్సరం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"పుష్ప" మూవీ లో పోలీస్ ఆఫీసర్ గా తమిళ హీరో ఆర్య ?

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , సునీల్ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బన్నీ, రానా కు 'బ్రహ్మీ' బహుమతి

నవ్వుల రారాజు బ్రహ్మీ కామెడీ గురించి కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. ఆయన నటన గురించి అందరికీ తెలుసు కానీ చిత్ర కారుడు అన్న విషయం మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. అయితే హాస్య కళతో పాటు బ్రహ్మీలో మరొక కళ కూడా ఉందన్న సంగతి ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం. ఏదో చిత్రాలు వేసాం అన్నట్టు కాదు.. బ్రహ్మీ వేసిన చిత్రాలు చూస్తే ఆయనలో ఎంత ప్రతిభ ఉందో చెప్పొచ్చు. జీవం ఉట్టిపడేలా ఉన్నాయి ఆయన వేసిన చిత్రాలు చూస్తుంటే. చిత్రకళ పట్ల ఆయనకున్న తృష్ణ కనిపిస్తుంది. మొన్నామధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం రాముని వీర భక్తుడు 'ఆంజనేయుని ఆనంద భాష్పాలు' పేరుతో చిత్రం గీశారు. ఆ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శృతి రియాక్షన్ కు బన్నీ షాక్

సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ‘కిక్’ శ్యామ్ అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అందరినీ అలరించింది. “టామ్ అండ్ జెర్రీ”లా నిత్యం పోట్లాడుకుంటూ ఉండే ఇద్ద‌రు అన్నదమ్ముల మధ్య ఉండే భావోద్వేగాల‌ను.. వినోదాత్మ‌కంగా వెండితెర‌పై ఆవిష్కరించాడు సురేందర్ రెడ్డి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అల్లు అర్హకు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ క్యూట్ క్యూట్ మాటలు ఎలా వుంటాయో.. ఎంత యాక్టీవ్ గా ఉంటుందో..బన్నీ కూడా తన కూతురితో ముద్దు ముద్దు గా ఎలా మాట్లాడిస్తాడో సోషల్ మీడియాలో బన్నీ అప్ లోడ్ చేస్తున్న వీడియోలను బట్టి చెప్పొచ్చు. ఇప్పటికే అర్హకు సంబంధించి ఎన్నో వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు అర్హ పుట్టిన రోజు పండుగ సందర్భంగా ఒక వీడియో తో పాటు స్పెషల్ సర్ ప్రయిజ్ ఇచ్చాడు. ఈ రోజు బన్నీ కూతురు అల్లు అర్హబర్త్‌డే. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ఆమెకు స్పెషల్‌ గిఫ్ట్‌ను అందించి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. చిన్న సర్‌ప్రైజ్ అంటూ అర్హకు ఓ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

థమన్ కు మహేష్, బన్నీ బర్త్ డే విషెస్

'అల వైకుంఠపురములో' లాంటి ఆడియో ఆల్బమ్ తో ఈ ఏడాదిని స్టార్ట్ చేసాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్. వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న థమన్ ను 'అల వైకుంఠపురములో' సినిమా మరో మెట్టు ఎక్కించింది. ఈ పాటలు యూ ట్యూబ్ లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాయో.. ఎన్ని రికార్డ్స్ సాధించాయో చూసాం. ఇక ప్రస్తుతం థమన్ ఒకటి కాదు రెండు కాదు డజను సినిమాలతో సూపర్ బిజీ గా వున్నాడు. ఇక ఈ రోజు థమన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తమన్నా కు విషెస్ తెలియజేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'పుష్ప' - నవంబర్ మొదటి వారం నుండి షూటింగ్

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇప్పటివరకూ ఆర్య, ఆర్య2 రాగా.. ఇప్పుడు మూడోసారి 'పుష్ప' సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. బన్నీ రస్టిక్ అండ్ రఫ్ లుక్‌లో లారీ డ్రైవర్‌గా కనబడనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం గతంలో విడుదల చేసిన ఫస్ట్ లుక్ ను బట్టి చెప్పొచ్చు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి కానీ కరోనా వల్ల సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ రాలేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అన్నను పిల్లోగా మార్చేసుకున్న అల్లు అర్హ

హీరోల సంగతి పక్కన పెడితే వాళ్ల సతీమణులు కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, ఉపాసన, సమంత ఇలా చాలా మంది సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు.

TFN Adminవాట్సాప్
Pushpa Movie Team Heads To East Godavari District For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

ఈస్ట్ గోదావరి అడవుల్లో "పుష్ప "

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా నిలిచిపోయిన "పుష్ప మూవీ షూటింగ్ ముందుగా కేరళ అడవుల్లో చిత్రీకరణకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది . కరోనా కారణంగా హైదరాబాద్ దగ్గరలోని వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరపాలనుకొన్న ప్లాన్ మార్చి ఈస్ట్ గోదావరి రంప చోడవరం , మారేడు మిల్లి అడవులలో చిత్రీకరణ జరపడానికి చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

5ఏళ్ల 'రుద్రమదేవి' - స్పెషల్ జర్నీ

అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా రుద్రమదేవి. తొలి భారతీయ స్టీరియో స్కోపిక్ త్రీడి చిత్రంగా రూపొందిన రుద్ర‌మదేవి గుణ‌శేఖ‌ర్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కి మంచి విజయం సాధించింది. ఇక తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రిలీజైన ఈ చిత్రంలో అనుష్కశెట్టి, అల్లు అర్జున్, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజ్, నిత్య మెనన్, బాబా సెహగల్, కేథరీన్ లు న‌టించిన ఈ సినిమా నేటితో 5ఏళ్ళు పూర్తి చేసుకుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"మోసగాళ్ళు " మూవీ టీజర్ గ్లింప్స్ రిలీజ్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , AVA ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ వాస్తవ సంఘటన నేపథ్యంలో తెలుగు , ఇంగ్లీష్ భాషలలో "మోసగాళ్ళు " మూవీ రూపొందుతుంది. కాజల్ అగర్వాల్ , సునీల్ శెట్టి , నవీన్ చంద్ర , నవదీప్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శామ్ CS సంగీతం అందిస్తున్నారు. "మోసగాళ్ళు " మూవీ జూన్ 5వ తేదీ రిలీజ్ కావాల్సివుండగా కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'పుష్ప'లో చెయ్యట్లేదు- క్లారిటీ ఇచ్చిన మాధవన్

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించే ప్రయత్నంలో వున్నారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవి శ్రీ ప్రసాద్ మాత్రం అప్పుడే సగానికి పైగా ట్యూన్స్ కంపోజ్ చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'విష్ణు' స్కామ్ లో బన్నీ హ్యాండ్

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్‌ ఫస్ట్‌, సునీల్‌ శెట్టి, కాజల్ ఫస్ట్‌ లుక్ పోస్టర్ లను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మై క్యూటీ హ్యాపీ బర్త్ డే

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును, అభిమానులను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఇక టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో బన్నీ-స్నేహా రెడ్డి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధంలేని స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా.. ఫ్యామిలీ మాత్రం ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తూనే వుంటారు. భార్య స్నేహారెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి సరదాగా గడుపుతుంటారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆదిలాబాద్‌ లో బన్నీ - ఫ్యామిలీ టూర్ మాత్రమే

అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కించనున్న ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. ఇక అందరూ చిన్న చిన్నగా షూటింగ్ లు మొదలు పెడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన పుష్ప సినిమా చిత్రబృందం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను‌ ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్