బన్నీ ‘ఐకాన్’ రావడం పక్కా – వేణు శ్రీరామ్

Allu Arjun Icon Movie Director Confirms That The Movie Has Not Yet Stalled And Is Still On Cards

బన్నీ ఐకాన్ సినిమా.. ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుండి వార్తల్లోనే ఎక్కువ నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వం లో బన్నీ హీరోగా ఐకాన్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2019 లోనే ఈ సినిమాను ప్రకటించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా ముందుకు వెళ్లలేకపోయింది. దానికి తోడు బన్నీ త్రివిక్రమ్ తో సినిమా మొదలుపెట్టేసరికీ అప్పట్లో ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న చిత్రయూనిట్ బన్నీ పుట్టినరోజున చిత్రయూనిట్ తరపున విషెస్ చెప్పి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరోసారి వేణు శ్రీరామ్ ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు శ్రీరామ్ ఈ సినిమా ఆగిపోలేదనీ, ఈ సినిమా విషయంలో తాను బన్నీతో టచ్ లోనే ఉన్నాననీ చెప్పాడు. ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని.. ప్రస్తుతం ఇద్దరం పలు కమిట్మెంట్స్ తో ఉన్నాం అవి అయిపోయిన తర్వాత ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళతాం అని చెప్పాడు.

ఇక ప్రస్తుతం వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ సినిమాతో బిజీ గా వున్నాడు. మరోవైపు బన్నీ సుకుమార్ సినిమాతో బిజీగా వున్నాడు. ఈ సినిమా షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. ఎలాగూ శ్రీరామ్ వకీల్ సాబ్ తో బిజీ గా ఉండటంతో బన్నీ కూడా ఈ గ్యాప్ లో పుష్ప సినిమా పూర్తి చేయాలనే ప్లాన్ లో వున్నాడు. అయితే బన్నీ కొరటాల సినిమా కూడా కన్ఫామ్ అయిపోయింది. మరి కొరటాల తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ తో చేస్తాడా.. ముందే చేస్తాడా అన్నది మాత్రం తెలియాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 17 =