హ్యాపీ బర్త్ డే శిరి.. నువ్వు ఎప్పుడూ నా ఫెవరెట్ బేబీనే..!

Stylish Star Allu Arjun Greets Birthday Wishes To Allu Sirish On Twitter Says You Are Always My Favourite Baby
Stylish Star Allu Arjun Greets Birthday Wishes To Allu Sirish On Twitter Says You Are Always My Favourite Baby

అల్లు అర్జున్- అల్లు శిరీష్ ల మధ్య ఉన్న సంబంధం గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ అవ్వడానికి అన్నదమ్ములు అయినా… ఫ్రెండ్స్ లాగానే ఉంటారన్న సంగతి చాలా సందర్భాల్లో చూశాం. ఇక ఈ రోజు అల్లు శిరీష్ పుట్టిన రోజు కావడంతో అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా తమ్ముడికి బర్త్ డే విషెస్ చెప్పాడు. హ్యాపీ బర్త్ డే శిరి.. ఈ ప్రపంచంలోనే నువ్వు ఎప్పుడూ నా ఫెవరెట్ బేబీనే అంటూ తమ్ముడిపై ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ ట్వీట్ చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ గతకొంత కాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. శిరీష్ చేసిన లాస్ట్ మూవీ ఏబీసీడీ.మలయాళి రీమేక్‌గా తెరకెక్కించిన ఏబీసీడీ చిత్రం హిట్ కొడుతుందని అంతా భావించినా అది కూడా నిరాశనే మిగిల్చింది ఇప్పుడు కాస్త లాంగ్ గ్యాప్ తీసుకొని మరో సినిమాతో రాబోతున్నాడు. అల్లు శిరీష్ తదుపరి చిత్రం ఓ తమిళ హిట్ రీమేక్ అని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ దేవ్ నటించిన విజేత చిత్రాన్ని రూపొందించిన రాకేష్ శశి డైరెక్షన్‌లో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాను ఇటీవలే మొదలుపెట్టాలనుకున్నారు కానీ… అదే టైం కి కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ వచ్చి పడింది. దీనితో షూటింగ్ వాయిదా పడింది. మరి జూన్ నుండి షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు కాబట్టి షూటింగ్ మొదలు పెడతారేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 4 =