
ట్యాగ్ · 109 కథనాలు · పేజీ 5

రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్
సెట్స్ పైకి ఆచార్య.. ముందు చెర్రీతో..!
రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్

ఈ సినిమాతో మాఅమ్మ కల నిజమవుతుంది
'చిట్టిబాబు' సెటైర్ - పనికొచ్చే వార్తలే వింటా..!
ప్రతీకారం కోరుకుంటే ఎదుగుదల ఉండదు..!
లాక్ డౌన్ సమయం లో రామ్ చరణ్
రామ్ చరణ్ క్వారంటైన్ లుక్
లాక్ డౌన్ లో రామ్ చరణ్ ఫీలింగ్స్
కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ లో రామ్ చరణ్
వెన్న తీయడం ఎలా..నానమ్మతో చరణ్..!
పవన్ కళ్యాణ్ చిత్రంలో రామ్ చరణ్?

రామ్ చరణ్‌తో అనిల్ రావిపూడి?

రామ్ చరణ్ ‘రంగస్థలం’కు రెండేళ్ళు

అదే నాకు బెస్ట్ గిఫ్ట్ - రామ్ చరణ్

ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన రామ్ చరణ్
అభిమానులకు రామ్ చరణ్ మనవి

'క్రాక్' చాలా ఎంజాయ్ చేశా
యదార్ధ సంఘటనల ఆధారంగా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా క్రాక్. జనవరి 9 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. గోపీచంద్-రవితేజ ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టారు. అంతేకాదు కలెక్షన్ల విషయంలో కూడా అందరి అంచనాలను తలకిందులు చేస్తుంది.
రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్
సెలెబ్రిటీస్ ను మాత్రం కరోనా ఇప్పుడప్పుడే వదిలే ప్రసక్తి కనిపించట్లేదు. అసలు ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ అని చెపుతూ షాకులిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ మాకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.. అయినా పాజిటివ్ వచ్చింది అని చెప్పిన సంఘటనలు గుర్తుండేవుంటాయి . అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా పాజిటివ్ అని చెప్పి షాకిచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
అప్పుడే 13 ఏళ్లు.. నమ్మలేకపోతున్నా అంటున్న చెర్రీ
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలో అగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎప్పటికప్పుడు తనలోని నటుడిని మెరుగుపరుచుకుంటూ.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ.. జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక చెర్రీ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు అవుతుంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు చరణ్.
సెట్స్ పైకి ఆచార్య.. ముందు చెర్రీతో..!
లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమలు మొత్తం షూటింగ్ లు లేక ఇన్ని నెలలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే మన తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ఒక్కొక్కరూ షూటింగ్ లను స్టార్ట్ చేశారు. సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ప్రెస్, నాగచైతన్య కూడా `లవ్‌స్టోరీ` షూటింగ్‌ను ప్రారంభించాడు. నాగార్జున ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. మహేష్ కూడా ఓ యాడ్ షూటింగ్ కోసం బయటకు వచ్చాడు. వకీల్ సాబ్ సినిమా షూట్ కూడా ఈ నెలలోనే స్టార్ట్ చేయనున్నారట.
రామ్ చరణ్ డ్రీమ్ ప్రాజెక్ట్
హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి హీరోగా "ఖైదీ నెం 150 ", "సైరా నరసింహా రెడ్డి " మూవీస్ ను నిర్మించారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా "ఆచార్య " మూవీ ని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో మాఅమ్మ కల నిజమవుతుంది
ఫైనల్లీ మా అమ్మ డ్రీమ్ ఇన్నేళ్లకు నెరవేరుతుంది అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతకీ ఆ డ్రీమ్ ఏంటనుకుంటున్నారా..? అదేంటంటే.. చిరు-రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ పై చూడాలని చిరు సతీమణి.. రామ్ చరణ్ తల్లి సురేఖకు ఎప్పటినుండో కోరికట. అది ఆచార్య సినిమాతో మొత్తానికి నిజమవుతుందని చెపుతున్నాడు రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా.
'చిట్టిబాబు' సెటైర్ - పనికొచ్చే వార్తలే వింటా..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ చరణ్ పోస్ట్ ఏంటి అంటే.. తన ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లో రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు ఫొటోను పోస్ట్ చేసి... ”కేవలం నిజమైన సమాచారాన్ని మాత్రమే వింటున్నాను’ అంటూ ఓ పోస్ట్ చేశాడు. దీనితో రామ్ చరణ్ వేసిన సెటైర్ ఎవరికబ్బా అని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు చాలామంది ఆర్జీవీ ఇష్యూ పైనే అని అంటున్నారు.
కన్ఫ్యూజన్ లో చరణ్ - హార్ట్ ఒకటి చెపుతుంది.. మైండ్ ఒకటి చెపుతుంది..!
మొత్తానికి రామ్ చరణ్ కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే లాక్ డౌన్ లో షూటింగ్స్ లేక సెలెబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఏదో ఒకటి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అనుకున్నారు కానీ ఇన్ని రోజులు ఈ కరోనా వల్ల బ్రేక్ వస్తుంది అని మాత్రం ఊహించలేదు. ఇక షూటింగ్స్ లేవు కాబట్టి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే షూటింగ్ లేదు కదా అని వర్కౌట్స్ చేయకుండా ఉంటే కుదరదు కదా. షూటింగ్ ఉన్నా లేకపోయినా అవి మాత్రం హీరో హీరోయిన్స్ చేయాల్సిందే. చేయపోతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎంత హీరో హీరోయిన్స్ అయినా వాళ్ళకి కూడా అప్పుడప్పుడు బద్ధకం…
ప్రతీకారం కోరుకుంటే ఎదుగుదల ఉండదు..!
రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్ గా వుండడన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఫేస్‌బుక్‌లో మాత్రమే ఉండేది. అది కూడా ఏదో నామ మాత్రం అన్నట్టుగానే ఉండేవాడు. ఇక ఇటీవలే ట్విట్టర్లోకి అడుగు పెట్టాడు. ట్విట్టర్ కూడా అదే పరిస్థితి. చాలా రేర్ గా అప్ డేట్స్ ఇస్తుంటాడు. అయితే చరణ్ తాజాగా చేసిన ట్వీట్ మాత్రం వైరల్ అవ్వడమే కాకుండా ఆలోచింపచేస్తుంది. ఇంతకీ చరణ్ పెట్టిన ట్వీట్ ఏంటంటే.. ‘‘హింస లేదా అహింస.. మార్గం ఏదైనా, ప్రతీకారం కోరుకుంటే మనం ఉన్న చోట స్తంభించిపోతాం తప్ప ఎదుగుదల ఉండదు.’’ అని రామ్ చరణ్ ట్వీట్ చేసి ఆయన నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలోని ఓ స్టిల్‌ను, మరో క్లోజప్ స్టిల్‌ను పోస్ట్ చేశారు…
లాక్ డౌన్ సమయం లో రామ్ చరణ్
మూవీ షూటింగ్స్ , ఓపెనింగ్స్ , ప్రమోషన్స్ , ఫొటో షూట్స్ తో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి మూడు నెలలుగా ఇంటికే పరిమితం అయ్యారు. తమ తమ వ్యాపకాలతో టైమ్ పాస్ చేస్తున్నారు. షూటింగ్స్ కు రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చినా స్టార్ హీరో , హీరోయిన్స్ షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి కనపరచడం లేదు.
రామ్ చరణ్ క్వారంటైన్ లుక్
సూపర్ హిట్ "చిరుత "మూవీ తో టాలీవుడ్ కు రామ్ చరణ్ హీరోగా పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ "మగధీర ", "రచ్చ ", "నాయక్ ", "ఎవడు ", "ధృవ " , రంగస్థలం " వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రేక్షక , అభిమానులను అలరించారు. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ "ఖైదీ నెం 150", "సైరా నరసింహా రెడ్డి " మూవీస్ ను నిర్మించారు. ప్రస్తుతం "ఆచార్య " మూవీ నిర్మిస్తున్నారు.
లాక్ డౌన్ లో రామ్ చరణ్ ఫీలింగ్స్
కరోనా వైరస్ కారణంగా అనేక పరిశ్రమలతో పాటు కోట్లాది రూపాయల టర్నోవర్ ఉండే చిత్ర పరిశ్రమ కూడా పలు ఇబ్బందులు గురి అయినవిషయం తెలిసిందే. మూవీ షూటింగ్స్, రిలీజ్ లు , ఓపెనింగ్స్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూ లతో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఎప్పుడూ లేనిది సుమారు 2నెలలపాటు ఇంటికే అంకితం అయిన సెలబ్రిటీస్ లాక్ డౌన్ సమయం కంప్లీట్ కై , షూటింగ్స్ ప్రారంభానికై ఎదురు చూస్తున్నారు.
కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ లో రామ్ చరణ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం" మూవీ 2021 సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 8వ తేదీ రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా కథానాయికలు కాగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.
వెన్న తీయడం ఎలా..నానమ్మతో చరణ్..!
లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఈ టైంలో ఇంట్లో కుటుంబసభ్యులతో కాలాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతే కాదు సోషల్ మీడియా ద్వారా తాము చేసే పనులను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూడా ఓ వీడియో ను పోస్ట్ చేసాడు.
పవన్ కళ్యాణ్ చిత్రంలో రామ్ చరణ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘వకీల్ సాబ్’ కాగా.. మరొకటి ‘విరూపాక్ష’ (ప్రచారంలో ఉన్న పేరు). వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ ఆగస్టు 14న విడుదల కానుందని ప్రచారం సాగుతోంది. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాస్ట్యూమ్ డ్రామా ‘విరూపాక్ష’లో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ దర్శనమివ్వనున్నారని టాక్. పవన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఎంతో ఉన్నతంగా ఉండేలా ఈ పాత్రను డిజైన్ చేశాడట దర్శకుడు క్రిష్.

రామ్ చరణ్‌తో అనిల్ రావిపూడి?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `డైరెక్టర్ నంబర్ వన్` రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం రణం రుధిరం)తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి విడుదల కానున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే పూర్తి కానుందని తెలుస్తోంది. అంతేకాదు... ఈలోపే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.

రామ్ చరణ్ ‘రంగస్థలం’కు రెండేళ్ళు
అన్నదమ్ముల సెంటిమెంట్‌తో తెలుగునాట పలు చిత్రాలు సందడి చేశాయి. వాటిలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ ఒకటి. ఇందులోని “చిట్టిబాబు” పాత్రలో చరణ్ అభినయించిన తీరు విమర్శకులను సైతం కట్టిపడేసింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ 80లనాటి పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో సమంత కథానాయికగా నటించింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, నరేష్, అనసూయ భరద్వాజ్, రోహిణి, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషించగా... స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నర్తించింది.

అదే నాకు బెస్ట్ గిఫ్ట్ - రామ్ చరణ్
స్టార్ హీరోగా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన 35 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. మామూలు రోజుల్లో అయితే అభిమానుల కోలాహలానికి హద్దే ఉండదు. కరోనా వైరస్ కారణంగా ఇళ్ళకే పరిమితం అయిన అభిమానులు తమ అభిమాన హీరో రామ్ చరణ్ ను పుట్టిన రోజు శుభాకాంక్షలతో ముంచెత్తారు.

ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన రామ్ చరణ్
మెగా స్టార్ చిరంజీవి ఉగాది పండగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ లలో యాక్టివ్ గా ఉన్న రామ్ చరణ్ కొన్నాళ్ళుగా ట్విట్టర్ కు దూరం గా ఉన్నారు.
అభిమానులకు రామ్ చరణ్ మనవి
కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తం గా జన జీవనం అస్తవ్యస్తమయింది. కరోనా వైరస్ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశం ఉంది. ఇప్పటికే నిర్మాతలు మూవీ రిలీజ్ లు, షూటింగ్స్ రద్దుచేశారు. టాలీవుడ్ ప్రముఖులు ఎటువంటి వేడుకలు నిర్వహించరాదని నిర్ణయం తీసుకున్నారు.