లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమలు మొత్తం షూటింగ్ లు లేక ఇన్ని నెలలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి షూటింగ్ లు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే మన తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోలు ఒక్కొక్కరూ షూటింగ్ లను స్టార్ట్ చేశారు. సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, సందీప్ కిషన్ ఏ1 ఎక్స్ప్రెస్, నాగచైతన్య కూడా `లవ్‌స్టోరీ` షూటింగ్‌ను ప్రారంభించాడు. నాగార్జున ఇప్పటికే షూటింగ్ ప్రారంభించారు. మహేష్ కూడా ఓ యాడ్ షూటింగ్ కోసం బయటకు వచ్చాడు. వకీల్ సాబ్ సినిమా షూట్ కూడా ఈ నెలలోనే స్టార్ట్ చేయనున్నారట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఆచార్య టీం కూడా త్వరలోనే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నారట. అయితే ముందు చరణ్ సీన్లను పూర్తి చేస్తారట. ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా చెర్రీ సీన్లను చిత్రీకరిస్తారట. ఎలాగూ చరణ్ పాత్ర నిడివి కాస్త తక్కువే కాబట్టి ముందు ఆ సీన్స్ పూర్తి చేస్తే ఒక పని అయిపోతదని తర్వాత చిరు తో షూట్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారట. త్వరలోనే చరణ్ పక్కన నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేసి షూట్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నారట.
నిజానికి కరోనా లేకపోతే ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేది. లాక్ డౌన్ కు ముందే 40 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. లాక్ డౌన్ కనుక లేకపోతే దసరా, దీపావళి సీజన్ లోనే విడుదలై ఉండేది. మరి వచ్చే ఏడాది ఏప్రిల్ 9 న ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. చూద్దాం ఇందులో ఎంత నిజముందో.
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: