ఫైనల్లీ మా అమ్మ డ్రీమ్ ఇన్నేళ్లకు నెరవేరుతుంది అంటున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇంతకీ ఆ డ్రీమ్ ఏంటనుకుంటున్నారా..? అదేంటంటే.. చిరు-రామ్ చరణ్ ను ఒకే స్క్రీన్ పై చూడాలని చిరు సతీమణి.. రామ్ చరణ్ తల్లి సురేఖకు ఎప్పటినుండో కోరికట. అది ఆచార్య సినిమాతో మొత్తానికి నిజమవుతుందని చెపుతున్నాడు రామ్ చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ తాను ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలిపాడు. నేను చేసిన బ్రూస్లీ సినిమాలో నాన్న అతిథి పాత్రలో నటించారు.. నేను కూడా నాన్న కమ్ బ్యాక్ ఫిలిం ఖైదీ నెం.150 లో ఒక పాటలో నాన్నతో కలిసి స్టెప్ వేసా.. కానీ ఇప్పటివరకూ ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకున్నది లేదు.. అయితే ఈ సినిమాలో నటిస్తుండటంతో అమ్మ కల నెరవేరుతుందని చెప్పాడు.
మొత్తానికి ఇన్ని రోజులు ఉన్న కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చాడు. మొదట రామ్ చరణ్ అన్నారు, ఆ తర్వాత మహేష్ అన్నారు కాదు కాదు అల్లు అర్జున్ అన్నారు. ఆఖరికి రామ్ చరణే ఫిక్స్ అయ్యాడు. మరి ఈ సూపర్ కాంబినేషన్ ను స్క్రీన్ పై చూడాలంటే ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలో..
ఇదిలా ఉండగా ఈ సినిమా40 శాతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు కూడా బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో నక్సలైట్ పాత్రలో చిరు నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: