అప్పుడే 13 ఏళ్లు.. నమ్మలేకపోతున్నా అంటున్న చెర్రీ

Mega Power Star Ram Charan Pens An Emotional Tweet Thanking His Fans As He Completes 13 Years In Tollywood

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలో అగుపెట్టినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎప్పటికప్పుడు తనలోని నటుడిని మెరుగుపరుచుకుంటూ.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ.. జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక చెర్రీ ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్లు అవుతుంది. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు చరణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా చరణ్.. అప్పుడే 13 ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. గొప్ప విజయాలు.. కొన్ని పరాజయాలు.. అన్నింటినీ ఎంజాయ్ చేశా. అన్ని వేళలా నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. మరింత కష్టపడి మిమ్మల్ని సంతోషపెడతాన`ని చెర్రీ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఈరోజు పూరీ జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా తనకు విషెస్ చెపుతూ.. తన మొదటి సినిమా చిరుత సినిమాను కూడా గుర్తుచేసుకున్నాడు. `చిరుత` యూనిట్ మొత్తానికి ధన్యవాదాలు తెలిపాడు.

 

కాగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. ఈ సినిమాతోపాటు ఆచార్య సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రాలేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =