మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ చరణ్ పోస్ట్ ఏంటి అంటే.. తన ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లో రంగస్థలం సినిమాలోని చిట్టిబాబు ఫొటోను పోస్ట్ చేసి… ”కేవలం నిజమైన సమాచారాన్ని మాత్రమే వింటున్నాను’ అంటూ ఓ పోస్ట్ చేశాడు. దీనితో రామ్ చరణ్ వేసిన సెటైర్ ఎవరికబ్బా అని అందరూ అనుకుంటున్నారు. అంతేకాదు చాలామంది ఆర్జీవీ ఇష్యూ పైనే అని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Listening to Credible Info ONLY!! pic.twitter.com/x5iNV9MALD
— Ram Charan (@AlwaysRamCharan) July 24, 2020
రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుండి రోజుకో పోస్టర్ అంటూ టీజర్ అంటూ.. ట్రయిలర్ అంటూ ఏదో ఒకటి అప్ డేట్ ఇస్తూనే వున్నారు. ఇక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిర్మాత అల్లు అరవింద్ కూడా వర్మ పరోక్షంగా పవన్ ని ఉద్దేశిస్తూనే సినిమా తీస్తున్నాడని విరుచుకుపడ్డారు. ఇక ఈ విషయంపైనే వర్మను ఉద్దేశిస్తూ చరణ్ ట్వీట్ చేసి ఉంటారని అంటున్నారు చాలామంది.
ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం ” అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇటీవల డైరెక్టర్ వెంకీ కుడుములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: