మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `డైరెక్టర్ నంబర్ వన్` రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ ఆర్ ఆర్`(రౌద్రం రణం రుధిరం)తో బిజీగా ఉన్నాడు. 2021 సంక్రాంతికి విడుదల కానున్న ఈ పేట్రియాటిక్ డ్రామాలో చరణ్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే పూర్తి కానుందని తెలుస్తోంది. అంతేకాదు… ఈలోపే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘సరిలేరు నీకెవ్వరు’ ఇలా వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో చరణ్ తన తదుపరి సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే చరణ్‌కి అనిల్ కథను వినిపించాడని, స్టోరీ నచ్చడంతో సదరు కొణిదెల స్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. అలాగే.. ‘ఆర్ ఆర్ ఆర్’ వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న డి.వి.వి.దానయ్యనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించనున్నాడని టాలీవుడ్ టాక్. త్వరలోనే చరణ్, అనిల్ కాంబినేషన్ ఫిల్మ్‌పై మరింత క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: