మొత్తానికి రామ్ చరణ్ కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే లాక్ డౌన్ లో షూటింగ్స్ లేక సెలెబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఏదో ఒకటి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అనుకున్నారు కానీ ఇన్ని రోజులు ఈ కరోనా వల్ల బ్రేక్ వస్తుంది అని మాత్రం ఊహించలేదు. ఇక షూటింగ్స్ లేవు కాబట్టి ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తున్నారు. అయితే షూటింగ్ లేదు కదా అని వర్కౌట్స్ చేయకుండా ఉంటే కుదరదు కదా. షూటింగ్ ఉన్నా లేకపోయినా అవి మాత్రం హీరో హీరోయిన్స్ చేయాల్సిందే. చేయపోతే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఎంత హీరో హీరోయిన్స్ అయినా వాళ్ళకి కూడా అప్పుడప్పుడు బద్ధకం లాంటివి రావడం కామనే. ఇప్పుడు అలాంటి పరిస్థితిలోనే ఉన్నా అంటున్నాడు చరణ్. వర్క్ అవుట్ చేస్తూ ఉన్న ఒక ఫొటో తన ఇన్స్టా లో పోస్ట్ చేస్తూ దానికి మైండ్ ఏమోవర్క్ అవుట్ చేయమని చెప్తుంది.. హార్ట్ ఏమో అంటూ తన ఫీలింగ్ ను చెప్తున్నాడు. మరి ఏది ఏం చెప్పినా ఫైనల్ గా వర్క్ అవుట్స్ చేయడం మాత్రం తప్పదు కదా..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ గ్యాప్ లో పలు స్క్రిప్ట్స్ మాత్రం వింటూనే ఉన్నాడు. ఇక దానితో పాటు చిరు సినిమా ఆచార్య కు నిర్మాత గా కూడా వ్యవహరిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: