పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘వకీల్ సాబ్’ కాగా.. మరొకటి ‘విరూపాక్ష’ (ప్రచారంలో ఉన్న పేరు). వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘వకీల్ సాబ్’ ఆగస్టు 14న విడుదల కానుందని ప్రచారం సాగుతోంది. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాస్ట్యూమ్ డ్రామా ‘విరూపాక్ష’లో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ దర్శనమివ్వనున్నారని టాక్. పవన్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఎంతో ఉన్నతంగా ఉండేలా ఈ పాత్రను డిజైన్ చేశాడట దర్శకుడు క్రిష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఓ ప్రత్యేక పాత్ర ఉందట. ఆ క్యారెక్టర్ కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో చర్చలు జరుపుతున్నారట పవన్. బాబాయ్ సినిమా కావడం, అందులోనూ తన పాత్ర తీరు తెన్నులు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అబ్బాయ్ చరణ్. మరి, తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో మాత్రమే అతిథి పాత్రల్లో కనిపిస్తూ వస్తున్న చరణ్.. బాబాయ్ పవన్ మూవీలో స్పెషల్ రోల్ లో ఏ మేరకు మెస్మరైజ్ చేస్తాడో చూడాలి. త్వరలోనే చరణ్ ఎంట్రీకి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: