అదే నాకు బెస్ట్ గిఫ్ట్ – రామ్ చరణ్

Mega Power Star Ram Charan Speaks About His Special Birthday Gift

స్టార్ హీరోగా, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన 35 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. మామూలు రోజుల్లో అయితే అభిమానుల కోలాహలానికి హద్దే ఉండదు. కరోనా వైరస్ కారణంగా ఇళ్ళకే పరిమితం అయిన అభిమానులు తమ అభిమాన హీరో రామ్ చరణ్ ను పుట్టిన రోజు శుభాకాంక్షలతో ముంచెత్తారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిన్ననే ట్విట్టర్ లో ఎంటర్ అయిన రామ్ చరణ్ తన అభిమానుల గురించి ట్విట్టర్ ద్వారా స్పందించారు. మిడ్ నైట్ నుండి తనను శుభాకాంక్షలతో ముంచెత్తిన అభిమానులకు రామ్ చరణ్ ఒక సందేశం ఇచ్చారు. లాక్ డౌన్ కాలం ముగిసే వరకు ఇళ్ళకే పరిమితం అవ్వండి అని అదే తనకు మీరిచ్చే బెస్ట్ గిఫ్ట్ అని “స్టే హోమ్ ,స్టే సేఫ్” అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు. దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ లో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 1 =