రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

Chiranjeevi Konidela, COVID 19, Ram charan, Ram Charan Corona Positive, Ram Charan Corona Positive News, Ram Charan Corona Positive Updates, Ram Charan Coronavirus, Ram Charan Latest News, Ram Charan next movie, Ram Charan Tests Corona Positive, Ram Charan Tests Positive, Ram Charan Tests Positive For COVID-19, ram charan upcoming movies, Telugu Filmnagar, tollywood updates

సెలెబ్రిటీస్ ను మాత్రం కరోనా ఇప్పుడప్పుడే వదిలే ప్రసక్తి కనిపించట్లేదు. అసలు ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ అని చెపుతూ షాకులిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ మాకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.. అయినా పాజిటివ్ వచ్చింది అని చెప్పిన సంఘటనలు గుర్తుండేవుంటాయి . అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా పాజిటివ్ అని చెప్పి షాకిచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తనకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్టు చరణ్ స్వయంగా తన సోషమ్ మీడియా ద్వారా అందరికీ తెలియచేసాడు. కరోనా పాజిటివ్ వచ్చింది.. క‌రోనా ల‌క్ష‌ణాలు ఏవి లేవు. ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. త్వ‌ర‌లోనే కోలుకొని మీ ముందుకు వ‌స్తాను అంటూ తెలిపాడు. అంతేకాదు గ‌త కొద్ది రోజులుగా న‌న్ను కలిసిన వాళ్లు కూడా ప‌రీక్ష‌లు చేయించుకోండి అంటూ చెర్రీ ట్వీట్ చేశాడు.

రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామ‌రాజు అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో చిత్ర షూటింగ్ పూర్త‌వుతుంద‌ని అనుకునే క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్‌కు క‌రోనా రావడం దురదృష్టమే. మరో వైపు నిన్ననే చరణ్ ఆచార్య సెట్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టి నిర్విరామంగా షూట్ జరుపుకుంటున్న ఈ సమయంలో ఇలాంటి వార్త ఆచార్య టీంకు కూడా కాస్త షాకిచ్చేదే. మరి చుద్దాం ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 9 =