లాక్ డౌన్ లో రామ్ చరణ్ ఫీలింగ్స్

Ram Charan about Lockdown

కరోనా వైరస్ కారణంగా అనేక పరిశ్రమలతో పాటు కోట్లాది రూపాయల టర్నోవర్ ఉండే చిత్ర పరిశ్రమ కూడా పలు ఇబ్బందులు గురి అయినవిషయం తెలిసిందే. మూవీ షూటింగ్స్, రిలీజ్ లు , ఓపెనింగ్స్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూ లతో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఎప్పుడూ లేనిది సుమారు 2నెలలపాటు ఇంటికే అంకితం అయిన సెలబ్రిటీస్ లాక్ డౌన్ సమయం కంప్లీట్ కై , షూటింగ్స్ ప్రారంభానికై ఎదురు చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన సెలబ్రిటీస్ రొటీన్ లైఫ్ గా ఫీల్ అయ్యి సాధారణ పరిస్థితులకై ఎదురు చూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అదే ఫీలింగ్ లో ఉన్నారు. హీరో రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. “RRR”మూవీ సెట్స్ పై వెళ్ళడానికి ఆతృతగా ఉన్న రామ్ చరణ్ వెయిట్ చేయలేక పోతున్నానని, #ధృవ మూవీ జ్ఞాపకాలు అంటూ ఆమూవీ లోని కొన్ని ఫోటోలను షేర్ చేసి , స్టే హోమ్ ,స్టే సేఫ్ అని ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.