ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 212
"బీ ది రియల్ మెన్ " ఛాలెంజ్ లో ఎన్టీఆర్
కృష్ణ ‘సూపర్ మొగుడు’కి 25 ఏళ్ళు
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ చిత్రం
‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌లో క్రేజీ హీరో?
కరోనా పై పోరాటంలో విజయం సాధిస్తాం - రష్మిక
విలన్ గా నటించడం నిజం కాదు - గోపీచంద్

ఆన్ లైన్ క్లాసెస్ తో నిధి అగర్వాల్ బిజీ
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేను..!
డిఫరెంట్ యాక్షన్ సీన్స్ తో "వాలిమై"
నవంబర్ వరకూ థియేటర్స్ తెరుచుకోకపోవచ్చు ..!

దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి
"పుష్ప "మూవీ సర్ ప్రైజింగ్ న్యూస్
సర్ నాకు తెలుసు 'బిజినెస్ మేన్ 2' ఎప్పుడు..?
'ఏయ్ నువ్వు నంద అయితే, నేను బద్రి.. బద్రీనాథ్.. అయితే ఏంటి? ఇరవై ఏళ్ళు అవుతున్నా ఈ డైలాగ్ కు ఉన్న.. సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ రోజుకి ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అటు హీరోగా పవన్ కెరీర్ అప్పటికే మంచి పీక్ లో వుంది.. అయితే డైరెక్టర్ గా పూరీ కు మాత్రం ఈసినిమా ఒక కీలక మలుపైంది. క్లాస్ సబ్జెక్టుకు.. పవన్ మాస్ మేనరిజమ్స్, స్టైలిష్ యాక్షన్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక ఈ సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా హావానే నడిచింది ఈ రోజు. అటు పవన్ అభిమానులు, పూరీ, ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన రేణు దేశాయ్ ఇక చాలా మంది సెలెబ్రిటీస్ ఈ…
"బీ ది రియల్ మెన్ " ఛాలెంజ్ లో ఎన్టీఆర్
బ్లాక్ బస్టర్ "అర్జున్ రెడ్డి"మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ , ఇళ్ళను శుభ్రపరచడంలో మహిళల కంటే పురుషులు ఏ మాత్రం తీసిపోరు అనే "బీ ది రియల్ మెన్ " ఛాలెంజ్ ను స్టార్ డైరెక్టర్ రాజమౌళి ని సవాల్ చేశారు. ఆ సవాల్ ను స్వీకరించి తన ఇంటిని క్లీన్ చేస్తున్న వీడియో ను పోస్ట్ చేస్తూ ఆ సవాల్ ను ఎన్టీఆర్, రామ్ చరణ్, శోభు యార్లగడ్డ, సుకుమార్, కీరవాణి లకు రాజమౌళి విసిరారు.

వెంకటేష్, రాఘవేంద్రరావు కాంబినేషన్ మూవీ ‘సుభాష్‌చంద్రబోస్’కు 15 ఏళ్ళు
విక్టరీ వెంకటేష్‌తో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడిగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘కలియుగ పాండవులు’(1986) సినిమాతో వెంకటేష్‌ను కథానాయకుడిగా పరిచయం చేసిన దర్శకేంద్రుడు.. అనంతరం వెంకీ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అలా.. సక్సెస్‌ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి కలయికలో వచ్చిన ఆఖరి చిత్రం ‘సుభాష్‌చంద్రబోస్’. అగ్ర నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్నదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
కృష్ణ ‘సూపర్ మొగుడు’కి 25 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన పలు కుటుంబకథా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘సూపర్ మొగుడు’ ఒకటి. శరత్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. కృష్ణకి జోడిగా రమ్యకృష్ణ నటించింది. దివ్యవాణి, సత్యనారాయణ, సుధాకర్, మహేష్ ఆనంద్, ఏవీయస్, మల్లికార్జునరావు, చక్రవర్తి, బాబూమోహన్, అనంత్, నిర్మలమ్మ, రాజేశ్వరి, పాకీజా ముఖ్య పాత్రలు పోషించారు.
చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ చిత్రం
తెలుగునాట స్టైలిష్ ఫిల్మ్ మేకర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు మెహర్ రమేష్. అయితే, తెలుగు చిత్రాల కంటే ముందే కన్నడనాట రెండు విజయవంతమైన చిత్రాలు రూపొందించిన వైనం మెహర్ సొంతం. ‘వీర కన్నడిగ’(‘ఆంధ్రావాలా’కు రీమేక్) ‘అజయ్’(‘ఒక్కడు’ రీమేక్).. ఇలా మెహర్ తెరకెక్కించిన రెండు కన్నడ చిత్రాలు విజయపథంలో పయనించాయి. అనంతరం టాలీవుడ్‌పై దృష్టి సారించిన మెహర్.. తెలుగులో ‘కంత్రి’(2008), ‘బిల్లా’(2009), ‘శక్తి’(2011), ‘షాడో’(2013) వంటి చిత్రాలను తీర్చిదిద్దాడు. వీటిలో ‘బిల్లా’ చిత్రం మెరుగైన ఫలితాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం తెలుగులో మరో భారీ…
నవంబర్ నుంచి రవితేజ, త్రినాథరావు కాంబినేషన్ మూవీ?
‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. కాగా, తన తదుపరి చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నట్టు గత కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.
‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌లో క్రేజీ హీరో?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’.. తెలుగునాట ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. హిందీనాట రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ పోషించిన బంటు పాత్రలో అక్షయ్ కుమార్ లేదంటే షాహిద్ కపూర్ నటించే అవకాశం ఉందని ఆ మధ్య కథనాలు వినిపించాయి.
అంత ధ్వేషం మంచిది కాదన్నా.. నెటిజెన్ కు రేణు స్ట్రాంగ్ కౌంటర్..!
సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పై కామెంట్స్ రావడం అనేది కామన్ థింగ్. కొన్నిసార్లు కొంత మంది వాటిని సీరియస్ తీసుకుంటే.. కొంతమంది లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం కామెంట్ చేసినవాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు అలానే ఒక నెటిజెన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రేణు దేశాయ్.
కరోనా పై పోరాటంలో విజయం సాధిస్తాం - రష్మిక
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రజలు ప్రాణ భయం తో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ కూడా కొనసాగుతుంది. పలువురు సినీ సెలబ్రిటీస్ ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ జాగ్రత్తలపై అవగాహన కలిపిస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కన్నడ బ్యూటీ రష్మిక తన వంతుగా ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
విలన్ గా నటించడం నిజం కాదు - గోపీచంద్
"తొలి వలపు" మూవీ తో గోపీచంద్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తరువాత గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన "జయం ", "వర్షం"మూవీస్ ఘనవిజయం సాధించాయి. గోపీచంద్ తిరిగి హీరోగా నటించిన "యజ్ఞం" మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన రణం, లక్ష్యం, శౌర్యం, సాహసం, లౌక్యం, జిల్ మూవీస్ విజయం సాధించాయి.

ఆన్ లైన్ క్లాసెస్ తో నిధి అగర్వాల్ బిజీ
"సవ్యసాచి "మూవీ తో టాలీవుడ్ లో ఎంటర్ అయిన నిధి అగర్వాల్ బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్" మూవీ తో విజయం సాధించారు. నిధి ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ గల్లా హీరోగా రూపొందుతున్న మూవీ లో నటిస్తున్నారు. "భూమి " మూవీ తో కోలీవుడ్, "జేమ్స్ " మూవీ తో శాండల్ వుడ్ లో నిధి ఎంటర్ అవుతున్నారు.
ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేను..!
రాజమౌళి సినిమాలంటే అదో బ్రాండ్ అంతే. తన మొదటి నుండి ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా అందుకోకుండా కేవలం విజయాలను మాత్రమే అందుకొని.. బాహుబలి సినిమాతో తన స్థాయిని... తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషల్ రేంజ్ కు తీసుకెళ్లాడు. మరి అలాంటి డైరెక్టర్ నుండి మరో సినిమా రాబోతుందంటే ఎన్ని అంచనాలు ఉంటాయో తెలుసు. ముఖ్యంగా ఒక డైరెక్టర్ గా ఆ అంచనాలను రీచ్ అవ్వాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పనో రాజమౌళికే అర్ధమవుతుంది. సినిమా రావడానికి కాస్త లేట్ అవ్వొచ్చేమో కానీ.. దానికి తగిన రిజల్ట్ మాత్రం రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.
డిఫరెంట్ యాక్షన్ సీన్స్ తో "వాలిమై"
బోనీ కపూర్ మూవీస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "తీరన్ అధిగారం ఒండ్రు " , "నెర్కొండ పార్వై " మూవీస్ ఫేమ్ హెచ్ వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్న స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై" తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో హుమా ఖురేషి, యామీ గౌతమ్ కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

నేను రిటైర్ అయ్యేంత వరకూ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి..!
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'బద్రి' సినిమా అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో చెప్పనక్కర్లేదు. ఒక రకంగా పవన్ కు యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకొచ్చిన సినిమా ఇది. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తయింది. దీనితో మరోసారి ఈ సినిమాను సోషల్ మీడియాలో గుర్తుచేసుకుంటున్నారు పవన్, పూరీ ఫ్యాన్స్. ఇప్పటికే రేణు దేశాయ్ ఈ సినిమా షూటింగ్ లో ఎంత కష్టపడిందో చెప్పుకొస్తూ... అప్పటి షూటింగ్ కు సంబంధించి కొన్ని రేర్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.
నవంబర్ వరకూ థియేటర్స్ తెరుచుకోకపోవచ్చు ..!
లాక్ డౌన్ వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు కాస్త కష్ట కాలమే. ఎన్నో సినిమాల షూటింగ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగి పోయాయి. థియేటర్స్ మూత పడ్డాయి. దీనివల్ల ఎంతో మంది ఉపాధిని సైతం కోల్పోయారు. మరోపక్క ఈ వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ కూడా అప్పుడే తీసే పరిస్థితి లేదు. ఏప్రిల్ లో తీద్దామనుకున్నది కాస్త మే కి వెళ్ళింది.. మరి మే లో కూడా లాక్ డౌన్ తీయడం కష్టమే అన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.

దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి
సూపర్ హిట్ "బద్రి " మూవీ తో పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సూపర్, పోకిరి, దేశముదురు, చిరుత, బిజినెస్ మేన్, ఇద్దరమ్మాయిలతో, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.

దసరా పండగకు "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" రిలీజ్ ?
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని, ఈషా రెబ్బా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

ప్రభాస్, త్రిష కాంబినేషన్ ఫిల్మ్ ‘పౌర్ణమి’కి 14 ఏళ్ళు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కలిసొచ్చిన కథానాయికల్లో త్రిష ఒకరు. వీరిద్దరి కలయికలో ‘వర్షం’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. వీటిలో డ్యాన్స్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ‘పౌర్ణమి’.. ఒక వర్గం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ప్రభుదేవా డైరెక్షన్‌లో రూపొందిన ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌లో.. ఛార్మి మరో హీరోయిన్‌గా నటించింది. ముకేష్ రుషి, గీత, చంద్రమోహన్, మంజు భార్గవి, హర్షవర్ధన్, సింధు తులాని, తనికెళ్ళ భరణి, రాహుల్ దేవ్, కోట శ్రీనివాసరావు, సుబ్బరాజు, బ్రహ్మాజీ, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు.

నాగార్జున తొలి ద్విపాత్రాభినయ చిత్రం ‘హలోబ్రదర్’కి 26 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జునకు అచ్చొచ్చిన దర్శకుల్లో ఇ.వి.వి.సత్యనారాయణ ఒకరు. వీరిద్దరి కలయికలో మూడు చిత్రాలు తెరకెక్కగా.. వాటిలో రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. అందులో ‘హలోబ్రదర్’ ఒకటి. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కోసం.. తొలిసారి ద్విపాత్రాభినయం చేసారు నాగార్జున. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య కథానాయికలుగా నటించగా.. శరత్‌బాబు, సంగీత, గిరిబాబు, సుధ, అన్నపూర్ణ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, బాబుమోహన్, అలీ, శ్రీహరి, నెపోలియన్, రాజనాల ముఖ్యభూమికలు పోషించారు. ఆమని, రంభ, ఇంద్రజ ప్రత్యేక గీతంలో కనువిందు చేశారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని…
"పుష్ప "మూవీ సర్ ప్రైజింగ్ న్యూస్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప"మూవీ రూపొందుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ లో చిత్తూరు యువకుడిగా అల్లు అర్జున్ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న "పుష్ప" మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.