కృష్ణ ‘సూపర్ మొగుడు’కి 25 ఏళ్ళు

Super Star Krishna Wholesome Family Entertainer Super Mogudu Completes 25 Years

సూపర్ స్టార్ కృష్ణ క‌థానాయ‌కుడిగా తెరకెక్కిన పలు కుటుంబకథా చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘సూపర్ మొగుడు’ ఒకటి. శరత్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో.. కృష్ణకి జోడిగా రమ్యకృష్ణ నటించింది. దివ్యవాణి, సత్యనారాయణ, సుధాకర్, మహేష్ ఆనంద్, ఏవీయస్, మల్లికార్జునరావు, చక్రవర్తి, బాబూమోహన్, అనంత్, నిర్మలమ్మ, రాజేశ్వరి, పాకీజా ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి గీత రచన చేయగా.. రాజ్ – కోటి స్వరకల్పన చేసారు. వాటిలో “శృంగార సూపర్ మొగుడా”, “అల్లరి బుగ్గకు”, “ఇదే మొదటిసారి”, “అందాల”, “నర్తనశాల నవ్వులమాల” వంటి గీతాలు ప్రేక్షకులను అలరించాయి. అల్లం నాగార్జున, కామినేని ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1995 ఏప్రిల్ 21న విడుదలైన ‘సూపర్ మొగుడు’.. నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

‘సూపర్ మొగుడు’ – కొన్ని విశేషాలు:

* కృష్ణ, దర్శకుడు శరత్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్ర‌మిదే.
* కృష్ణకి జోడిగా రమ్యకృష్ణ (సోలో హీరోయిన్‌గా) నటించిన ఫస్ట్ మూవీ. అంతకుముందు ‘కిరాయి గూండా’(1993)లో రమ్య.. భానుప్రియతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.
* కృష్ణతో ‘ఇంటింటి కథ’(1974)ను నిర్మించిన కామినేని ప్రసాద్.. భారీ విరామం తరువాత ‘సూపర్ మొగుడు’ కోసం మరోసారి సూపర్ స్టార్‌తో క‌ల‌సి పనిచేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =