సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ పై కామెంట్స్ రావడం అనేది కామన్ థింగ్. కొన్నిసార్లు కొంత మంది వాటిని సీరియస్ తీసుకుంటే.. కొంతమంది లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం కామెంట్ చేసినవాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు. ఇప్పుడు అలానే ఒక నెటిజెన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రేణు దేశాయ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్ తో విడిపోయిన తర్వాత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు కామెంట్స్ ను ఎదుర్కొంటూనే ఉంది రేణు. ఇప్పుడు మరోసారి ఒక నెటిజెన్ కామెంట్ విసరగా రేణు గట్టిగానే పంచ్ ఇచ్చింది. పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ హీరో హీరోయిన్స్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘బద్రి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తయింది. దీనితో మరోసారి ఈ సినిమాను సోషల్ మీడియాలో గుర్తుచేసుకుంటూ.. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ ఈ సినిమా షూటింగ్ లో ఎంత కష్టపడిందో చెప్పుకొస్తూ… అప్పటి షూటింగ్ కు సంబంధించి కొన్ని రేర్ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. ఇక ఇది చూసిన ఓ నెటిజెన్ ” ఈ రేణు దేశాయ్ ఏంటో మళ్ళీ కెలుక్కుంటుంది.. ఇప్పుడు అవసరమా… ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది కదా.. ఆ విషయాలేంటి మల్లి అంటూ కాస్త ఎటకారంగా పోస్ట్ పెట్టాడు.
దానికి రేణు ‘మెసేజ్‌లో నాకిప్పుడే ఈ స్క్రీన్ షాట్ వచ్చింది. అవసరమా? అవును, అవసరం.. బద్రి చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. మీ ఇన్ఫర్మేషన్ కోసం. ఇది నా ఫస్ట్ మూవీ. నాకు చాలా స్పెషల్ మూవీ. ఇంత ద్వేషం ఎందుకన్నా.. మనం ఆల్ రెడీ ఒక వరల్డ్ క్రైసిస్‌లో ఉన్నాం.. ఒక వైరస్ వల్ల.. అందరి గురించి కొంచెం మంచి ఆలోచనలు పెట్టుకోండి. ఇంత కోపం మీ ఆరోగ్యానకి పనికి రాదు’.. అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. దీనితో మంచి సమాధానం ఇచ్చారంటూ రేణు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: