‘కింగ్’ నాగార్జునకు అచ్చొచ్చిన దర్శకుల్లో ఇ.వి.వి.సత్యనారాయణ ఒకరు. వీరిద్దరి కలయికలో మూడు చిత్రాలు తెరకెక్కగా.. వాటిలో రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. అందులో ‘హలోబ్రదర్’ ఒకటి. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కోసం.. తొలిసారి ద్విపాత్రాభినయం చేసారు నాగార్జున. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య కథానాయికలుగా నటించగా.. శరత్‌బాబు, సంగీత, గిరిబాబు, సుధ, అన్నపూర్ణ, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, బాబుమోహన్, అలీ, శ్రీహరి, నెపోలియన్, రాజనాల ముఖ్యభూమికలు పోషించారు. ఆమని, రంభ, ఇంద్రజ ప్రత్యేక గీతంలో కనువిందు చేశారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర, వెన్నెలకంటి సాహిత్యం సమకూర్చగా.. రాజ్ – కోటి చార్ట్ బస్టర్ సాంగ్స్‌ని అందించారు. “ప్రియరాగాలే”, “కన్నెపెట్టరో”, “మనసిచ్చి ఇచ్చి”, “ఎక్కండయ్య బాబు”, “అబ్బ ఏం దెబ్బ”, “చుక్కేసి పక్కేసి” ఇలా అన్ని పాటలు విశేషాదరణ పొందాయి. అలాగే, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో ఈ చిత్రానికి ‘నంది’ పురస్కారం సొంతం చేసుకున్నారు రాజ్ కోటి. 1994 ఏప్రిల్ 20న విడుదలై ఘనవిజయం సాధించిన ‘హలోబ్రదర్’.. నేటితో 26 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























