రాజమౌళి సినిమాలంటే అదో బ్రాండ్ అంతే. తన మొదటి నుండి ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా అందుకోకుండా కేవలం విజయాలను మాత్రమే అందుకొని.. బాహుబలి సినిమాతో తన స్థాయిని… తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషల్ రేంజ్ కు తీసుకెళ్లాడు. మరి అలాంటి డైరెక్టర్ నుండి మరో సినిమా రాబోతుందంటే ఎన్ని అంచనాలు ఉంటాయో తెలుసు. ముఖ్యంగా ఒక డైరెక్టర్ గా ఆ అంచనాలను రీచ్ అవ్వాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పనో రాజమౌళికే అర్ధమవుతుంది. సినిమా రావడానికి కాస్త లేట్ అవ్వొచ్చేమో కానీ.. దానికి తగిన రిజల్ట్ మాత్రం రికార్డులు బద్దలు కొట్టాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొదలు పెట్టి కూడా దాదాపు రెండేళ్లు అవుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుందిలే అనుకున్నారు కానీ కరోనా వచ్చి పడటంతో షూటింగ్ లకు బ్రేక్ పడింది. దీనితో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ పై మళ్ళీ క్లారిటీ పోయింది. నిజానికి ఈ ఏడాది జులై అనుకున్నారు అది కాస్త వచ్చే ఏడాది జనవరి 8 అనుకున్నారు కానీ ఇప్పుడు అది కూడా కష్టమే అంటున్నారు. దీనిమీద వార్తలు కూడా రాగా అదేం లేదు ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న డేట్ కే వస్తుందని అన్నారు. కానీ ఇప్పుడు రాజమౌళిని రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేనని చెపుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంలో వుంది… షూటింగ్ పూర్తయిన తర్వాత కానీ రిలీజ్ డేట్ అప్ డేట్ ఇవ్వలేము.. షూటింగ్ అనుకున్న టైంకి అయిపోయినా… పోస్ట్ ప్రొడక్షన్ కు మాత్రం టైం పడుతుంది… లాక్ డౌన్ వల్ల అన్ని పనులు వాయిదా పడ్డాయి.. విఎఫ్ఎక్స్ పనులు ఒకటి జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చాడు. మరి చూడబోతే ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జనవరిలో రావడం కొంచెం కష్టం లాగే కనిపిస్తుంది.




ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: