మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలుగా GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆమని, ఈషా రెబ్బా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ పరిస్థితులను బట్టి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీ బ్యాలన్స్ వర్క్ కంప్లీట్ చేసి దసరా పండగకు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేసినట్టు సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన అఖిల్ ఫస్ట్ లుక్, పూజాహెగ్డే మోషన్ పోస్టర్, సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించిన మెలోడీ “మనసా మనసా ” సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అఖిల్ అక్కినేని హీరోగా నాల్గవ మూవీ గా రూపొందుతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” ఘనవిజయం సాధించాలని కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: