ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 211
‘ఫైటర్’ స్టోరీ లైన్ అదేనా?

లేట్ అయినా థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేస్తాం..!
మాస్ మహారాజా రవితేజ కు జోడీ గా త్రిష ?

అల్లు అర్జున్ ‘సరైనోడు’కి 4 ఏళ్ళు
చిరంజీవి వెబ్ సిరీస్ ఎంట్రీ

ప్రభాస్ ‘Mr.పర్‌ఫెక్ట్’కు 9 ఏళ్ళు
మలయాళ భాష ప్రాక్టీస్ లో ఎన్టీఆర్
‘ఆర్ ఆర్ ఆర్’.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

నేనేం సమంత ను కాదు.. అప్పుడే చెప్పడానికి..!
చిరు సినిమాలో బన్నీ.. అంతా తూచ్..!

తమిళ స్టార్ హీరో అజిత్ సాహసం
'ఫైటర్' తర్వాత ఆ హీరోతోనే నా సినిమా..!
"ఉప్పెన" మూవీ తమిళ రీమేక్ ?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ
కొరియన్ మూవీ రీమేక్ లో హీరోయిన్ రెజీనా
విజయ్ దేవరకొండ న్యూ మూవీ
అందుకే యంగ్ డైరెక్టర్స్ తో చేస్తున్నా..!
'అనుష్క' పై రూమర్స్ నమ్మకండి...!
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న బహుభాషా చిత్రం 'నిశ్శబ్దం'. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా రిలీజ్ మాత్రం ఇప్పటి వరకూ కాలేదు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమాపై పలు రూమర్లు కూడా వచ్చాయి. ఇక ఆ రూముర్లను కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వున్నారు చిత్రయూనిట్. కానీ రూమర్లను ఆపడం అనేది ఒక్కరివల్ల అయ్యేపని కాదు కదా. ఇప్పుడు తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. అనుష్క ఈ సినిమాకి సరిగ్గా సహకరించడంలేదని పలు కథనాలు వెలువడ్డాయి. దీనితో మరోసారి చిత్రయూనిట్ ముందుకొచ్చి వార్తల్లో నిజం లేదని చెప్పేసింది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ట్విట్టర్ ఖాతా ద్వారా.. ఈ సినిమా పై వస్తోన్న…
‘ఫైటర్’ స్టోరీ లైన్ అదేనా?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాక్సర్‌గా దర్శనమివ్వనున్నాడు విజయ్. ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ నటి రమ్యకృష్ణ ముఖ్య భూమికను పోషించనుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కాగా.. కరోనా ఎఫెక్ట్‌తో చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే.. ‘ఫైటర్’ స్టోరీ లైన్‌కు సంబంధించి ఆసక్తికరమైన కథనం వెలుగులోకి వచ్చింది.

లేట్ అయినా థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేస్తాం..!
లాక్ డౌన్ కారణంగా ఎన్నో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక మరోపక్క ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీనితో రిలీజ్ కాకుండా ఆగిపోయిన సినిమాలను కూడా ఆన్ లైన్ లోనే రిలీజ్ చేస్తారని ఇప్పటికే వార్తలు అందుకున్నాయి. ఇక ఈ వార్తలపై ఇప్పటికే పలు సినిమా దర్శక నిర్మాతలు స్పందించి అలాంటిది ఏం లేదు థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేస్తాం అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో డైరెక్టర్ కూడా తమ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెబుతున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఒరేయ్ బుజ్జిగా డైరెక్టర్ విజయ్ కుమార్.
మాస్ మహారాజా రవితేజ కు జోడీ గా త్రిష ?
మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ "డాన్ శీను ", పవర్ " మూవీస్ తరువాత రవితేజ , మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "క్రాక్" మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తరువాత రవితేజ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

దర్శకేంద్రుడి అద్భుత రూపకల్పన ‘కల్పన’కి 43 ఏళ్ళు
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తన కెరీర్ ఆరంభంలో పలు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ రూపొందించారు. వాటిలో ‘కల్పన’ ఒకటి. జయచిత్ర టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో మురళీమోహన్ కథానాయకుడిగా నటించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, ప్రభాకరరెడ్డి, గిరిబాబు, జయమాలిని, ఛాయాదేవి, భానుప్రకాష్ ముఖ్య భూమికలు పోషించారు. హిందీనాట ఘనవిజయం సాధించిన ‘అనామిక’(1973)చిత్రానికి రీమేక్‌గా ‘కల్పన’ని రూపొందించారు దర్శకేంద్రుడు.

అల్లు అర్జున్ ‘సరైనోడు’కి 4 ఏళ్ళు
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పలు మాస్ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కాయి. వాటిలో ‘సరైనోడు’ ఒకటి. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఇందులో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ ట్రెసా నాయికలుగా నటించగా.. శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సుమన్, సాయికుమార్, బ్రహ్మానందం, జయప్రకాశ్, వినయ ప్రసాద్, దేవదర్శిని, ప్రదీప్ రావత్, సురేఖావాణి, అన్నపూర్ణ, విద్యుల్లేఖ రామన్ ముఖ్య పాత్రలు పోషించారు. అంజలి ప్రత్యేక గీతంలో మెరిసింది.
చిరంజీవి వెబ్ సిరీస్ ఎంట్రీ
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "ఆచార్య" మూవీ తరువాత యువ దర్శకుల చిత్రాలలో నటించనున్నట్టు చిరంజీవి తెలిపారు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న చిరంజీవి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తాను ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నట్టు ప్రకటించారు.

ప్రభాస్ ‘Mr.పర్‌ఫెక్ట్’కు 9 ఏళ్ళు
“మనకు నచ్చింది చేస్తే కొంతే ఆనందం.. నలుగురికీ నచ్చింది చేస్తే ఎంతో ఆనందం..” అన్న పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘Mr.పర్‌ఫెక్ట్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కాజల్ అగర్వాల్, తాప్సీ నాయికలుగా నటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ దశరథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కె.విశ్వనాథ్, మురళీమోహన్, ప్రకాష్ రాజ్, నాజర్, తులసి, ప్రగతి, కౌశల్, షాయాజీ షిండే, బ్రహ్మానందం, కాశీ విశ్వనాథ్, సమీర్ ముఖ్య భూమికలు పోషించారు.
మలయాళ భాష ప్రాక్టీస్ లో ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం" మూవీ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. అన్ని భాషలలోనూ తన పాత్ర కు తానే డబ్బింగ్ చెప్పుకోవాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. హీరో రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన "RRR" మూవీ వీడియో కి ఒక్క మలయాళ భాషలో తప్ప మిగతా భాషలన్నిటికీ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
‘ఆర్ ఆర్ ఆర్’.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు.. వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన పోరాట యోధులు. నిజ జీవితంలో వీరిద్దరూ కలిసినట్లు చారిత్రక ఆధారాలు లేకపోయినా.. కలిస్తే ఎలా ఉంటుంది? అనే వినూత్నమైన ఆలోచనలోంచి పుట్టిన కథకు తెరరూపమే ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో.. కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్, అల్లూరిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా షూటింగ్ బ్రేక్ పడింది. లాక్ డౌన్ అనంతరం.. చిత్రీకరణని పునఃప్రారంభించనున్నారు.

నేనేం సమంత ను కాదు.. అప్పుడే చెప్పడానికి..!
కరోనా వల్ల అందరూ ఇంట్లోనే ఉండటంతో సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ అయిపోయారు. లైవ్ ల ద్వారా అభిమానులతో కాసేపు ముచ్చటిస్తున్నారు. పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటున్నారు. ఇక నిహారికా కూడా సోషల్ మీడియాలో కాసేపు మాట్లాడి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఇక వచ్చి ప్రతీ మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమాలు చేస్తా అని చెప్పింది. అంతే కాదు పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తారా..? అన్న ప్రశ్నకు సమాధానంగా... నేనేమన్న సమంతనా పెళ్లి తరువాత కూడా నటిస్తానని ఇప్పుడే చెప్పడానికి అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక నిహారిక కొద్దిగా టైమ్ ఉందని అనడంతో త్వరలోనే నిహారిగా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు అందుకున్నాయి.
చిరు సినిమాలో బన్నీ.. అంతా తూచ్..!
మోహన్ లాల్ హీరో గా మలయాళంలో గత ఏడాది వచ్చిన 'లూసిఫర్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎప్పుడో దక్కించుకున్నాడు. చిరంజీవి కథానాయకుడిగా ఆయన ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అంతేకాదు ఈ సినిమాను సాహో డైరెక్టర్ సుజిత్ తో డైరెక్ట్ చేయించాలని చిరు కూడా ప్లాన్ లో వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనిలో సుజిత్ ఉన్నట్లు తెలుస్తుంది.
స్టార్ హీరోలతో ఇంటి పని చేయిస్తున్న 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్
ప్రస్తుతం టాలీవుడ్ లో 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ నడుస్తుంది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ఈ ఛాలెంజ్ ఇప్పుడు స్టార్ హీరోల వరకూ వెళ్ళింది. సందీప్ వంగా మొదట ఈ ఛాలెంజ్ ను దర్శకుడు రాజమౌళి కి విసరగా.. రాజమౌళి ఛాలెంజ్ ను స్వీకరించి తన ఇంటిని శుభ్రం చేసి ఆ ఛాలెంజ్ ను కాస్త తారక్, రామ్ చరణ్‌లకు విసిరిన విషయం తెలిసిందే. దీంతో ఈ సవాలును స్వీకరించిన ఎన్టీఆర్ తన ఇంట్లో అంట్లు శుభ్రం చేస్తూ, ఇంటి ముందున్న చెత్తను ఊడ్చేశాడు.

తమిళ స్టార్ హీరో అజిత్ సాహసం
బోనీ కపూర్ మూవీస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్. వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ హీరో అజిత్ కుమార్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై" తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో హుమా ఖురేషి, యామీగౌతమ్ కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
'ఫైటర్' తర్వాత ఆ హీరోతోనే నా సినిమా..!
మొత్తానికి పూరీ జగన్నాథ్ తన తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నాడో క్లారిటీ ఇచ్చేసాడు. రీసెంట్ గా పూరీ జగన్నాథ్ ఇంట్లో ఉండే కొత్త సినిమా కథను రాసే పనిలో ఉన్నాడని.. ఓ అగ్ర హీరో కోసం పూరీ కథను సిద్ధం చేసే పనిలో పడ్డాడని.. అతను ఎవరో కాదు మెగా స్టార్ చిరంజీవి అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో గతంలో 150 సినిమా చేయాలనుకున్న పూరీ కోరిక ఈసారి తీరబోతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ వార్తలన్నిటినీ బ్రేక్ చేసి.. తన తర్వాత హీరో ఎవరో చెప్పేశాడు. ఫైటర్ తర్వాత తన తర్వాత సినిమా బాలకృష్ణ తో చేస్తున్నాడట. బాలకృష్ణకి కాల్ చేసి కథ వినిపించగా... కథ నచ్చడంతో బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు…
"ఉప్పెన" మూవీ తమిళ రీమేక్ ?
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానాదర్శకత్వంలో వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా "ఉప్పెన " మూవీ రూపొందింది. తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. వైష్ణవ తేజ్, కృతి శెట్టి లను తెలుగు తెరకు పరిచయం చేస్తున్న బుచ్చిబాబు కు "ఉప్పెన" ఫస్ట్ మూవీ కావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ
దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్) మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత బాలకృష్ణ హీరోగా ఒక మూవీ తెరకెక్కించనున్నారు. కొన్ని రోజుల క్రితం పూరి జగన్నాథ్ ఒక ఇంటర్వ్యూ లో ఒక స్టార్ హీరో కొరకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు వెల్లడించారు. పూరి జగన్నాథ్ నరేట్ చేసిన స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
కొరియన్ మూవీ రీమేక్ లో హీరోయిన్ రెజీనా
టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ తో పాటు కొరియన్ మూవీస్ కూడా తెలుగు లో రీమేక్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన కొరియన్ మూవీ తెలుగు రీమేక్ "ఓ బేబీ" ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరో కొరియన్ మూవీ తెలుగు లో రీమేక్ కానుంది.
విజయ్ దేవరకొండ న్యూ మూవీ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) లో నటిస్తున్న విషయం తెలిసిందే. మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్న విజయ్ ఈ మూవీ తో బాలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. విజయ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అందుకే యంగ్ డైరెక్టర్స్ తో చేస్తున్నా..!
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెం 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఆ సినిమా తర్వాత ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి సినిమా చేశాడు.. ఇప్పుడు కొరటాలతో ఆచార్య సినిమా చేస్తున్నాడు. అంతే కాదు పలు ప్రాజెక్టులను కూడా లైన్ లో పెడుతున్నాడు మెగా స్టార్. అయితే ఈసారి మాత్రం యంగ్ డైరెక్టర్స్ తో చేయడానికే రెడీ అయ్యాడు చిరు. అంతేకాదు ఇదే విషయంపై కూడా స్పందించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలిపారు.