లాక్ డౌన్ వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు కాస్త కష్ట కాలమే. ఎన్నో సినిమాల షూటింగ్ లు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగి పోయాయి. థియేటర్స్ మూత పడ్డాయి. దీనివల్ల ఎంతో మంది ఉపాధిని సైతం కోల్పోయారు. మరోపక్క ఈ వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ కూడా అప్పుడే తీసే పరిస్థితి లేదు. ఏప్రిల్ లో తీద్దామనుకున్నది కాస్త మే కి వెళ్ళింది.. మరి మే లో కూడా లాక్ డౌన్ తీయడం కష్టమే అన్న అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఒకవేళ లాక్ డౌన్ తీసేసినా కానీ థియేటర్స్ మాత్రం తెరుచుకోవడం కష్టమేనట. ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా చిరునే అంటున్నారు. లాక్ డౌన్ మే 7 ముగిసినా థియేటర్లు తెరుచుకునేందుకు చాలా కాలం పడుతుందని…ప్రభుత్వ దృష్టిలో సినిమా అనేది చివరి ప్రయారిటీ అయి ఉంటుంది కనుక… ఎంత లేదన్నా సినిమా థియేటర్లు తెరచుకోవడానికి నవంబర్ వరకు సమయం పట్టే అవకాశం ఉందని చిరు అంచనా వేస్తున్నాడు. అయితే షూటింగ్‌లు మాత్రం మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం అవుతాయని అంటున్నారు. ఈ లోపు ఉన్న సినిమాలకు షూటింగ్ లు పూర్తి చేసుకోవడమే.. మరో అవకాశం లేనట్టే.
మరి అదే నిజమైతే కనుక సినీ లవర్స్ కు ఇది బ్యాడ్ న్యూస్ అన్నట్టే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో చాలా మంది సినిమా ప్రియులే. కాస్త బోర్ కొట్టిందంటే థియేటర్ లో దూరిపోతుంటారు. ఎంత ఇంట్లో టీవీ ల్లో.. ఫోనుల్లో చూసినా.. థియేటర్ లో చూసిన కిక్కు వేరే కదా. అలాంటి వారు థియేటర్ కు వెళ్లాలంటే కొద్దిరోజులు కాదు కాదు చాలా రోజులే వెయిట్ చేయాలి..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)