ప్రభాస్, త్రిష కాంబినేషన్ ఫిల్మ్ ‘పౌర్ణమి’కి 14 ఏళ్ళు

Rebel Star Prabhas Musical Blockbuster Pournami Turns 14

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు కలిసొచ్చిన కథానాయికల్లో త్రిష ఒకరు. వీరిద్దరి కలయికలో ‘వర్షం’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. వీటిలో డ్యాన్స్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ‘పౌర్ణమి’.. ఒక వర్గం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ప్రభుదేవా డైరెక్షన్‌లో రూపొందిన ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌లో.. ఛార్మి మరో హీరోయిన్‌గా నటించింది. ముకేష్ రుషి, గీత, చంద్రమోహన్, మంజు భార్గవి, హర్షవర్ధన్, సింధు తులాని, తనికెళ్ళ భరణి, రాహుల్ దేవ్, కోట శ్రీనివాసరావు, సుబ్బరాజు, బ్రహ్మాజీ, సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి సాహిత్యానికి.. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ వినసొంపైన బాణీలు అందించారు. “మువ్వలా నవ్వకలా” విశేషాదరణ పొందగా.. “ఇచ్చి పుచ్చుకుంటే”, “భరతవేదముగా”, “ఎవరో రావాలి” వంటి పాటలు కూడా శ్రోతలను అలరించాయి. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎస్.రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2006 ఏప్రిల్ 20న విడుదలైన ‘పౌర్ణమి’.. నేటితో 14 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − ten =