స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’.. తెలుగునాట ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెల్యులాయిడ్ తాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. హిందీనాట రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ పోషించిన బంటు పాత్రలో అక్షయ్ కుమార్ లేదంటే షాహిద్ కపూర్ నటించే అవకాశం ఉందని ఆ మధ్య కథనాలు వినిపించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, తాజా సమాచారం ప్రకారం.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఈ రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బాలీవుడ్ ఖబర్. ‘సోనూ కే టీటు కి స్వీటీ’, ‘లూకాచుపి’ చిత్రాలతో కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తిక్. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వీటిలో ‘సోనూ కే టీటు కి స్వీటీ’ని బన్నీ హీరోగా త్రివిక్రమ్ రీమేక్ చేయబోతున్నట్టు ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ రీమేక్ కార్యరూపం దాల్చలేదు. ఆ స్థానంలోనే ‘అల వైకుంఠపురములో’ తెరకెక్కింది. కట్ చేస్తే.. ఇప్పుడు ‘అల’ రీమేక్‌లో కార్తీక్ హీరోగా నటించనుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే కార్తీక్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
మరి.. తెలుగునాట సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘అల’.. హిందీనాట కూడా అలజడి రేపుతుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: