విక్టరీ వెంకటేష్‌తో అత్యధిక చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడిగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘కలియుగ పాండవులు’(1986) సినిమాతో వెంకటేష్‌ను కథానాయకుడిగా పరిచయం చేసిన దర్శకేంద్రుడు.. అనంతరం వెంకీ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. అలా.. సక్సెస్‌ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్న వీరిద్దరి కలయికలో వచ్చిన ఆఖరి చిత్రం ‘సుభాష్‌చంద్రబోస్’. అగ్ర నిర్మాత అశ్వనీదత్ సమర్పణలో వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్నదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో వెంకీ ద్విపాత్రాభినయం చేయగా.. శ్రియ, జెనీలియా నాయికలుగా నటించారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, అలీ, తనికెళ్ళ భరణి, సుధ, కోట శ్రీనివాసరావు, బాబుమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు ముఖ్య భూమికలు పోషించారు.
చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ సాహిత్యం సమకూర్చగా.. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ అలరించే బాణీలు అందించారు. వాటిలో “నేరేడు పళ్ళు”, “మీ ఇంట్లో అమ్మానాన్నా”, “జాజిరి జాజిరి”, “మొక్కజొన్న తోటలో”, “అబ్రకదబ్ర” వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి. బెస్ట్ ఎడిటర్(కోటగిరి వెంకటేశ్వరరావు), బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్(బాషా), బెస్ట్ మేకప్ మ్యాన్(ఆర్.వి.రాఘవ) విభాగాల్లో ‘నంది’ పురస్కారాలను కైవసం చేసుకుందీ చిత్రం. 2005 ఏప్రిల్ 21న విడుదలైన ‘సుబాష్‌చంద్రబోస్’.. నేటితో 15 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: