నవంబర్ నుంచి ర‌వితేజ‌, త్రినాథరావు కాంబినేషన్ మూవీ?

Director Trinadha Rao Nakkina New Movie With Ravi Teja to Hit Floors From November

‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోక‌ల్’, ‘హలో గురు ప్రేమకోసమే’.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు దర్శకుడు త్రినాథ‌రావు న‌క్కిన. కాగా, తన తదుపరి చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నట్టు గత కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే.. అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కనున్న రవితేజ, త్రినాథరావు కాంబినేషన్ మూవీ.. ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇంతకుముందు ‘బెంగాల్ టైగర్’లో రవితేజకి జోడిగా నటించిన మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇందులో నాయికగా నటించబోతోందని టాక్. అంతేకాదు.. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ హిలేరియ‌స్‌గా సాగుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరింత స్పష్టత రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.