బోనీ కపూర్ మూవీస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “తీరన్ అధిగారం ఒండ్రు ” , “నెర్కొండ పార్వై ” మూవీస్ ఫేమ్ హెచ్ వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్న స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ “వాలిమై” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో హుమా ఖురేషి, యామీ గౌతమ్ కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో అజిత్ ఒక పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “వాలిమై” మూవీ కొంత షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది. తదుపరి షూటింగ్ షెడ్యూల్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో నిర్మాత ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో హీరో అజిత్ పై డిఫరెంట్ యాక్షన్ సీన్స్ ను దర్శకుడు తెరకెక్కించనున్నారు. లాక్ డౌన్ ముగిసిన తరువాత షూటింగ్ ప్రారంభం కానుంది. హెచ్ వినోత్, అజిత్ కాంబినేషన్ లో రూపొందిన “నెర్కొండ పార్వై ” మూవీ ఘనవిజయం సాధించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: