కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 196

సినిమా వార్తలు

'నా ఫ్యూచర్ పిల్లల తల్లి' వైరల్ గా మారిన విఘ్నేష్ శివన్ పోస్ట్

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార సినిమా కెరీర్ కు మాత్రం ఏ ఢోకా లేదు. స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది. తనకంటే లేట్ గా వచ్చిన హీరోయిన్స్ ఏ ఇప్పుడు వెనకపడినా నయన్ మాత్రం ఇంకా అదే హవా కొనసాగిస్తుంది. ఇక సినీ జీవితం పక్కన పెడితే.. వ్యక్తిత్వ జీవితం మాత్రం ఎప్పుడు వివాదాలతోనే ఉంటుంది. ఇప్పటికే రెండు మూడు బ్రేకప్ లు అయిన నయనతార గత కొన్నేళ్లుగా విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. తమ రిలేషన్ గురించి ఎక్కడా ఇంతవరకూ ఓపెన్ అయింది లేదు కానీ.. సోషల్ మీడియాలో తాము పలు సందర్భాల్లో కలిసి ఉన్న ఫొటో లు షేర్ చేస్తూ హింట్ ఇస్తూనే ఉంటారు.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"V" లో సుధీర్ బాబు స్టన్నింగ్ లుక్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ రూపొందింది. నివేత థామస్, అదితి రావు హైదరి కథానాయికలు కాగా జగపతి బాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సాంగ్స్ అందించగా, థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫస్ట్ 'మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌గా ‘పుష్ప‌’..!

సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే ఆ సినిమా కాస్టింగ్ లో విదేశీ నటీనటులు, టెక్నిషియన్స్ ఉంటారన్న సంగతి తెలిసిందే. కానీ ఇక్కడ ఓ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు కానీ.. ఇది మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీయనున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? ఆ సినిమా ఏదో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొందనున్న ‘పుష్ప‌’.

TFN Adminవాట్సాప్
Akkineni Nageswara Rao Musical Blockbuster Suthradharulu Completed 31 Years
సినిమా వార్తలు

అక్కినేని నాగేశ్వరరావు ‘సూత్రధారులు’కి 31 ఏళ్ళు

తెలుగు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ రూపొందిన పలు ఉత్తమ కథా చిత్రాల్లో నటించారు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. వాటిలో ‘సూత్రధారులు’ ఒకటి. “కళాతపస్వి” కె.విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏయన్నార్ నటించిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కె.విశ్వనాథ్.. ఏయన్నార్ క‌థానాయ‌కుడిగా నటించిన ‘ఆత్మగౌరవం’(1966) చిత్రంతోనే దర్శకుడిగా తొలి అడుగులు వేశారు. ఆ సినిమా అనంతరం దాదాపు రెండున్నర దశాబ్దాల భారీ విరామం తీసుకున్న ఈ ద్వయం.. ‘సూత్రధారులు’ చిత్రం కోసమే మరోసారి జట్టుకట్టడం విశేషం. ఇందులో ఏయన్నార్, సుజాత, మురళీమోహన్ ప్రధాన పాత్రధారులు కాగా.. భానుచందర్, రమ్యకృష్ణ నాయకానాయికలుగా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మేడ్ ఇన్ ఇండియా' ప్రాజెక్ట్‌గా ‘పుష్ప’

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో తొలి పాన్ - ఇండియా మూవీగా రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రష్మికా మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్ర చందనం అక్రమ రావాణా నేపథ్యంలో సాగే ఈ సినిమాకి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. లాక్ డౌన్ అనంతరం మలి షెడ్యూల్‌కి సన్నద్ధమవుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో రామ్ కోలీవుడ్ ఎంట్రీ

సూపర్ హిట్ "దేవదాసు " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి రామ్ పోతినేని తన యాక్టింగ్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "రెడీ","కందిరీగ", పండగ చేస్కో, "నేను శైలజ" వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ రఫ్ లుక్ తో నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ "ఇస్మార్ట్ శంకర్ "మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "RED" మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Sensational Blockbuster Movie Gabbar Singh Completes 8 Years.
సినిమా వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’కి 8 ఏళ్ళు

“నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది”.. అంటూ 8 ఏళ్ళ క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేల్చిన పంచ్ డైలాగ్ థియేటర్లలో ఏ స్థాయిలో పేలిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్‌గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా అదే బాట పట్టింది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్. ఇందులో పవన్‌కు జోడిగా శ్రుతి హాసన్ నటించింది…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలకృష్ణ చిత్రంలో 'స్వయంవరం' హీరో?

తొట్టెంపూడి వేణు.. నిన్నటి తరం ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. 'స్వయంవరం', 'చిరునవ్వుతో', 'హనుమాన్ జంక్షన్', 'పెళ్ళాం ఊరెళితే', 'క‌ళ్యాణ‌రాముడు', 'య‌మ‌గోల మ‌ళ్ళీ మొద‌లైంది'.. ఇలా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. అయితే, ఆ తర్వాత ఆశించిన విజయాలు దక్కకపోవడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందించిన 'దమ్ము' చిత్రంలో కీలక పాత్ర పోషించాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. కాగా, త్వరలోనే మరో నందమూరి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట వేణు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'అకీరా' కు ఇష్టమైన హీరో అతనే..!

స్టార్ హీరోల తనయులకు కూడా ఫెవరేట్ హీరోలు ఉంటారు. తమ తండ్రి పెద్ద హీరో అయినా కూడా వారితో పాటు వారు అభిమానించే హీరో వేరే ఉంటారు. ఇక్కడ ఓ స్టార్ హీరో తనయుడికి కూడా అభిమాన హీరో వేరే ఉన్నారట. ఇంతకీ ఆ స్టార్ హీరో... ఆ తనయుడు ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తనయుడు అకీరా నందన్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్, రాజమౌళి సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. జక్కన్న మల్టీస్టారర్ ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ అయ్యాక సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్ 'బృందావనం' చిత్రానికి సీక్వెల్ ప్లాన్?

యంగ్ టైగర్ యన్టీఆర్ కెరీర్‌లో మెమరబుల్ మూవీగా నిలిచిన చిత్రాల్లో 'బృందావనం' ఒకటి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో తారక్ సరికొత్తగా దర్శనమిచ్చాడు. టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి రూపొందించిన ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్.. అప్పట్లో మంచి విజయం సాధించింది. అంతేకాదు.. పలు భాషల్లో రీమేక్ అయింది కూడా.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెగాస్టార్‌తో మెహర్ రమేష్ రీమేక్ ప్లాన్?

' కంత్రి', 'బిల్లా', 'శక్తి', 'షాడో' చిత్రాలతో స్టైలిష్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెహర్ రమేష్. భారీ విరామం తర్వాత ఓ మెగా ప్రాజెక్ట్‌ని టేకప్ చేయబోతున్నాడు ఈ భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఇప్పటికే మెహర్ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయబోతున్నట్టు చిరు ప్రకటించారు కూడా.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కియారా అద్వానీ డ్రీమ్ ప్రాజెక్ట్ అదేనట

కియారా అద్వానీ.. ఈ త‌రం భారతీయ కుర్రకారు కలల రాణి. ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగునాట.. ‘ఎం.ఎస్.ధోని’, ‘కబీర్ సింగ్’, గుడ్ న్యూస్’ సినిమాలతో హిందీనాట త‌నదైన ముద్ర వేసింది కియారా. ప్రస్తుతం కియారా చేతిలో ‘లక్ష్మీ బాంబ్’, ‘ఇందూకి జవాని’, ‘షేర్‌షా’, ‘భూల్ భులయ్య 2’... ఇలా నాలుగు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్నా.. కియారా డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం వేరే ఉంద‌ట‌. ఇటీవల మీడియాకి ఇచ్చిన ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది కియారా.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నిరాడంబరంగా జరిగిన దిల్ రాజు రెండో వివాహం..!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో వివాహంపై గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వాటిపై క్లారిటీ ఇస్తూ తాను రెండో పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లి వెంకటేశ్వరాలయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం, 20 మంది కుటుంబీకులు, స్నేహితుల మధ్య గత రాత్రి నిరాడంబరంగా జరిగింది.

TFN Adminవాట్సాప్
సాంగ్

తప్పదు బడ్జెట్ విషయంలో పొదుపు పాటించాలి..!

కరోనా వల్ల అన్ని పరిశ్రమల లాగే సినిమా పరిశ్రమకు కూడా బాగానే నష్టం వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా దాదాపు 2వేల కోట్ల వరకూ బిజినెస్ ఆగిపోయిందని ఇటీవలే చెప్పిన సంగతి గుర్తుండేవుంటది. లాక్ డౌన్ తీసేసినా కూడా థియేటర్స్ మాత్రం ఇప్పట్లో తెరుచుకునే ఓపిక లేదు. ఈ జూన్ నుండి సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చినా కూడా థియేటర్ లకు అనుమతి ఇవ్వకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా పెండింగ్ లో ఉన్న సినిమాల నిర్మాతలకు మాత్రం నష్టమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'విరాట పర్వం' టీం కు తప్పిన ప్రమాదం..!

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆమె నా ఫేవరేట్ హీరోయిన్ - తనతో చేయాలని ఉంది..!

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. కేవలం కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా.. ఏదో ఒక్క జానర్ కే స్టిక్ అవ్వకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో వున్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి టాలెంటెడ్ హీరోకు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

చిరు-రానా కాంబినేషన్ లో మల్టీస్టారర్..?

టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు-వెంకీ, పవన్ కల్యాణ్-వెంకీ, వరుణ్ తేజ్-వెంకీ నానితో కలిసి నాగార్జున మురిపించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఆర్ఆర్ఆర్ సినిమాలోజూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ప్రేక్షకులను మైమరపించబోతున్నారు. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ తెర పైకి వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో వెంకటేష్ ?

ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారుతుంది. స్టార్ డమ్ ఉన్న హీరో, హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత "ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2" , సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ , లేట్ తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన "క్వీన్ "వెబ్ సిరీస్ లలో నటించారు. కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్, హన్సిక , అంజలి,ప్రియమణి వంటి టాప్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లకు మొగ్గుచూపుతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులకు శుభవార్త

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్ "రౌద్రం రణం రుధిరం " మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత #NTR30 మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనుంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కన్నడ మూవీ రికార్డ్స్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. #NTR30 మూవీ తరువాత ఈ మూవీ తెరకెక్కనుంది.

Team TFNవాట్సాప్

షేర్