‘అకీరా’ కు ఇష్టమైన హీరో అతనే..!

Actress Renu Desai Reveals About Akira Nandan Favourite Hero In A TV Interview
Actress Renu Desai Reveals About Akira Nandan Favourite Hero In A TV Interview

స్టార్ హీరోల తనయులకు కూడా ఫెవరేట్ హీరోలు ఉంటారు. తమ తండ్రి పెద్ద హీరో అయినా కూడా వారితో పాటు వారు అభిమానించే హీరో వేరే ఉంటారు. ఇక్కడ ఓ స్టార్ హీరో తనయుడికి కూడా అభిమాన హీరో వేరే ఉన్నారట. ఇంతకీ ఆ స్టార్ హీరో… ఆ తనయుడు ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తనయుడు అకీరా నందన్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు అభిమానులం కాదు భక్తులం అని చెప్పుకుంటారు ఫ్యాన్స్. తన నటనతో.. వ్యక్తిత్వం తో ఎంతో అభిమానం సొంతం చేసుకున్నాడు. అలాంటి.. పవన్ తనయుడు అకీరాకు మాత్రం అడివి శేష్ అంటే ఇష్టమట. నిన్న మదర్స్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు దేశాయ్ ఈ విషయాన్ని తెలిపారు. ఇద్దరు పిల్లల కెరీర్‌‌ని ఆమె ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారో తెలిపిన రేణు దేశాయ్, ఆ ఇద్దరి పిల్లలకు ఉన్న అభిరుచులను ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు ఒక స్టార్ హీరో కుమారుడైన అకీరాకు ఇష్టమైన హీరో ఎవరని అడుగగా.. ఆమె వెంటనే యంగ్ హీరో అడివి శేష్ గారంటే అకీరాకి చాలా ఇష్టం. ‘ఎవరు’ సినిమా చూసినప్పటి నుంచి అడివి శేష్‌గారిని అకీరా బాగా ఇష్టపడుతున్నాడు. తను నా ఫేవరేట్ హీరో అని కూడా చెబుతుంటాడు. అడివి శేష్‌గారిని అకీరా, అన్నా.. అని పిలుస్తాడు.. అని రేణు దేశాయ్ తెలిపారు.

అడివి శేష్ ప్రస్తుతం మేజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 3 =