ఆమె నా ఫేవరేట్ హీరోయిన్ – తనతో చేయాలని ఉంది..!

Mega Star Chiranjeevi and Rana Daggubati To Team Up For A Mulit Starrer Movie
Mega Star Chiranjeevi and Rana Daggubati To Team Up For A Mulit Starrer Movie

కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. కేవలం కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా.. ఏదో ఒక్క జానర్ కే స్టిక్ అవ్వకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో వున్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి టాలెంటెడ్ హీరోకు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. “కథానాయికలు గ్లామర్ పరంగా .. నటన పరంగా మంచి మార్కులు కొట్టేస్తున్నారు. పాత్రపై తమదైన ముద్రవేస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు. నేను పార్వతీ మీనన్ నటనను ఎక్కువగా ఇష్టపడతాను. ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. ఎలాంటి పాత్రనైనా ఆమె చాలా సింపుల్ గా చేసేస్తారు. అందువల్లనే ఆమె చాలా తక్కువ కాలంలోనే మలయాళంలో బిజీ కాగలిగారు. ఆమెతో కలిసి నటించాలని వుంది అని తెలిపారు. ఇక తెలుగులో హీరోలంతా ఇష్టమే .. వెంకటేశ్ అంటే మరికొంచెం ఎక్కువ ఇష్టం. చదువుకునే రోజుల్లో ఆయన సినిమాలు వదలకుండా చూసేవాడిని. ‘బొబ్బిలిరాజా’ తరువాత వెంకటేశ్ గారికి వీరాభిమానినయ్యానని తెలిపాడు. మరి ఆమెతో నటించే అవకాశం ఎప్పుడు వస్తుందో చూద్దాం..

ఇక ప్రస్తుతం తెలుగులో ఒక సినిమాలో నటిస్తున్నాడు శ్రీవిష్ణు. మరో రెండు కొత్త కథలు లైన్ లో వున్నాయట. లాక్ డౌన్ తర్వాత తన కొత్త సినిమాలు ఎనౌన్స్ చేస్తాడట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =