తప్పదు బడ్జెట్ విషయంలో పొదుపు పాటించాలి..!

Budget Limiting Is The Need Of The Hour Says SS Rajamouli
Budget Limiting Is The Need Of The Hour Says SS Rajamouli

కరోనా వల్ల అన్ని పరిశ్రమల లాగే సినిమా పరిశ్రమకు కూడా బాగానే నష్టం వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కూడా దాదాపు 2వేల కోట్ల వరకూ బిజినెస్ ఆగిపోయిందని ఇటీవలే చెప్పిన సంగతి గుర్తుండేవుంటది. లాక్ డౌన్ తీసేసినా కూడా థియేటర్స్ మాత్రం ఇప్పట్లో తెరుచుకునే ఓపిక లేదు. ఈ జూన్ నుండి సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చినా కూడా థియేటర్ లకు అనుమతి ఇవ్వకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఇంకా పెండింగ్ లో ఉన్న సినిమాల నిర్మాతలకు మాత్రం నష్టమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా దీనిపై స్పందించిన రాజమౌళి కరోనా సినీ రంగం మీద కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాదాపు 45 రోజులుగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి..ప్రస్తుతం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి…అంతేకాదు సినిమా బడ్జెట్‌ తో పాటు ఇతర విషయాల్లో కాస్త పొదుపు అవసరం అని చెప్పాడు.

మరి రాజమౌళి ప్రస్తుతం భారీ బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ సినిమా తీస్తున్నాడు. ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మరి అసలు ఏ విషయంలో కాంప్రమైజ్ కానీ రాజమౌళినే బడ్జెట్ విషయం లో పొదుపు పాటించాలని అంటున్నాడంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థంచేసుకోవచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 3 =