‘నా ఫ్యూచర్ పిల్లల తల్లి’ వైరల్ గా మారిన విఘ్నేష్ శివన్ పోస్ట్

Director Vignesh Shivan Calls Nayanthara Mother Of My Future Children
Director Vignesh Shivan Calls Nayanthara Mother Of My Future Children

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార సినిమా కెరీర్ కు మాత్రం ఏ ఢోకా లేదు. స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది. తనకంటే లేట్ గా వచ్చిన హీరోయిన్స్ ఏ ఇప్పుడు వెనకపడినా నయన్ మాత్రం ఇంకా అదే హవా కొనసాగిస్తుంది. ఇక సినీ జీవితం పక్కన పెడితే.. వ్యక్తిత్వ జీవితం మాత్రం ఎప్పుడు వివాదాలతోనే ఉంటుంది. ఇప్పటికే రెండు మూడు బ్రేకప్ లు అయిన నయనతార గత కొన్నేళ్లుగా విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. తమ రిలేషన్ గురించి ఎక్కడా ఇంతవరకూ ఓపెన్ అయింది లేదు కానీ.. సోషల్ మీడియాలో తాము పలు సందర్భాల్లో కలిసి ఉన్న ఫొటో లు షేర్ చేస్తూ హింట్ ఇస్తూనే ఉంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక గతకొద్దిరోజుల క్రితం విఘ్నేష్ శివన్ నుంచి కూడా నయన్ దూరంగా ఉంటుందని… కొన్ని రోజులుగా ఈ ఇద్దరూ కలిసి ఉండటం లేదని.. విడిపోయారని తమిళనాట వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా విఘ్నేష్ చేసిన పోస్ట్ తో తెలిసింది.

మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో విఘ్నేష్ శివ‌న్ నయన్ ఫొటో ను షేర్ చేశాడు. ఓ చిన్న బాబును ఎత్తుకున్న న‌య‌న‌తార ఫొటోని షేర్ చేసిన విఘ్నేష్ శివ‌న్ ఆ ఫొటోకు `చేతిలో చిన్న బాబును ఎత్తుకున్న .. నా పిల్లలకు ఫ్యూచర్ లో తల్లి అవ్వనున్న తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు` అని రాసుకొచ్చాడు. ఇక మామూలుగానే ఆగని నెటిజన్స్ ఈ పోస్ట్ కు సైలెంట్ గా వుంటారా..! వీరిద్దరు పేరెంట్స్ కాబోతున్నారా అంటూ కామెంట్స్ మొదలయ్యాయి. మరి విఘ్నేష్ అంత ఓపెన్ గా పోస్ట్ చేసాడంటే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో. చూద్దాం ఏం జరుగుతుందో..


[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =