అక్కినేని నాగేశ్వరరావు ‘సూత్రధారులు’కి 31 ఏళ్ళు

Akkineni Nageswara Rao Musical Blockbuster Suthradharulu Completed 31 Years

తెలుగు సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ రూపొందిన పలు ఉత్తమ కథా చిత్రాల్లో నటించారు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు. వాటిలో ‘సూత్రధారులు’ ఒకటి. “కళాతపస్వి” కె.విశ్వనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏయన్నార్ నటించిన పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన కె.విశ్వనాథ్.. ఏయన్నార్ క‌థానాయ‌కుడిగా నటించిన ‘ఆత్మగౌరవం’(1966) చిత్రంతోనే దర్శకుడిగా తొలి అడుగులు వేశారు. ఆ సినిమా అనంతరం దాదాపు రెండున్నర దశాబ్దాల భారీ విరామం తీసుకున్న ఈ ద్వయం.. ‘సూత్రధారులు’ చిత్రం కోసమే మరోసారి జట్టుకట్టడం విశేషం. ఇందులో ఏయన్నార్, సుజాత, మురళీమోహన్ ప్రధాన పాత్రధారులు కాగా.. భానుచందర్, రమ్యకృష్ణ నాయకానాయికలుగా నటించారు. కైకాల సత్యనారాయణ, కె.ఆర్.విజయ, అశోక్‌కుమార్, శ్రీలక్ష్మి, ‘సాక్షి’ రంగారావు, గోకిన రామారావు, పొట్టి ప్రసాద్ ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి దిగ్గజ స్వరకర్త కె.వి.మహదేవన్ వీనుల విందైన బాణీలు సమకూర్చగా.. డా.సి.నారాయణరెడ్డి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, మాడుగుల నాగఫణి శర్మ సాహిత్యం సమకూర్చారు. “జోలాజో రామజోలా”, “కొలిచినందుకు నిన్ను కోదండరామ”, “లేలేలో లేలేలేల్లో”, “కలలెందుకు కథలెందుకు”, “యోపం పుష్పం వేదా”, “మహారాజ రాజశ్రీ”, “శ్రీరస్తు శుభమస్తు”, “ఎదుకులవాడు”.. ఇలా ఇందులోని ప్రతీ పాట బాగా ప్రాచుర్యం పొందింది. సుదర్శన్ సినీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై సుధాకర్, కరుణాకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. ఉత్తమ ప్రాంతీయ చిత్రం(తెలుగు)గా జాతీయ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా.. ఉత్తమ తృతీయ చిత్రంగా ‘నంది’ పురస్కారం సైతం కైవసం చేసుకుంది. 1989 మే 11న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘సూత్రధారులు’.. నేటితో 31 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =