బాలకృష్ణ చిత్రంలో ‘స్వయంవరం’ హీరో?

Swayamvaram Hero Venu Thottempudi To Act Alongside Nandamuri Balakrishna In His Upcoming Movie

తొట్టెంపూడి వేణు.. నిన్నటి తరం ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేని పేరు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘క‌ళ్యాణ‌రాముడు’, ‘య‌మ‌గోల మ‌ళ్ళీ మొద‌లైంది’.. ఇలా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు. అయితే, ఆ తర్వాత ఆశించిన విజయాలు దక్కకపోవడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను రూపొందించిన ‘దమ్ము’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు ఈ టాలెంటెడ్ యాక్టర్. కాగా, త్వరలోనే మరో నందమూరి స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట వేణు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్ర కోసం వేణుని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే వేణు ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరి.. నందమూరి అబ్బాయ్ తారక్‌తో జట్టుకట్టి అలరించిన వేణు.. నందమూరి బాబాయ్ బాలయ్య కాంబినేషన్‌లోనూ ఆకట్టుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − nine =