వెబ్ సిరీస్ లో వెంకటేష్ ?

Victory Venkatesh To Make His Debut In To Digital Space With Director Teja Webseries

ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్ మారుతుంది. స్టార్ డమ్ ఉన్న హీరో, హీరోయిన్స్ వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్ సమంత “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” , సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ , లేట్ తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “క్వీన్ “వెబ్ సిరీస్ లలో నటించారు. కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్, హన్సిక , అంజలి,ప్రియమణి వంటి టాప్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లకు మొగ్గుచూపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు యువ హీరోలు కూడా వెబ్ సిరీస్ లపై ఆసక్తి తో ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరో వెంకటేష్ ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నారని సమాచారం. వెబ్ సిరీస్ లు ప్రజాదరణ పొందటంతో హీరో వెంకటేష్ తో ఒక వెబ్ సిరీస్ రూపొందించాలని సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు ప్లాన్ చేశారని, దర్శకుడు తేజ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. OTT ప్లాట్ ఫార్మ్ లో స్టార్ హీరోల సందడి కూడా మొదలు కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =