‘ కంత్రి’, ‘బిల్లా’, ‘శక్తి’, ‘షాడో’ చిత్రాలతో స్టైలిష్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మెహర్ రమేష్. భారీ విరామం తర్వాత ఓ మెగా ప్రాజెక్ట్‌ని టేకప్ చేయబోతున్నాడు ఈ భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు. మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఇప్పటికే మెహర్ కాంబినేషన్లో ఓ సినిమా చేయబోతున్నట్టు చిరు ప్రకటించారు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చిరు, మెహర్ రమేష్ కాంబినేషన్లో రానున్న సినిమా.. ఓ తమిళ చిత్రానికి రీమేక్‌గా రూపొందనుందని ప్రచారం సాగుతోంది. 2015లో విడుదలైన కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘వేదాళం’ ఆధారంగా చిరు, మెహర్ కాంబో మూవీ ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మరి… ఇప్పటికే అజిత్ నటించిన ‘బిల్లా’ని రీమేక్ చేసి హిట్ కొట్టిన మెహర్.. అదే అజిత్ నటించిన ‘వేదాళం’ రీమేక్‌తోనూ సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: