సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించి రామ్ పోతినేని తన యాక్టింగ్, డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “రెడీ”,”కందిరీగ”, పండగ చేస్కో, “నేను శైలజ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ రఫ్ లుక్ తో నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రామ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ “RED” మూవీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇంటర్ వ్యూ లో హీరో రామ్ మాట్లాడుతూ .. తమిళ మూవీస్ లో నటించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. చెన్నై లో పుట్టి , పెరిగిన రామ్ కు తమిళ భాషపై మంచి పట్టు ఉంది. మంచి స్క్రిప్ట్ తో కోలీవుడ్ కు రామ్ పరిచయం కానున్నారు. ఇక తాను హీరోగా నటించిన “RED” మూవీ గురించి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయం ముగిసిన తరువాత రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. రామ్ త్వరలోనే కోలీవుడ్ ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: