టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో వివాహంపై గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వాటిపై క్లారిటీ ఇస్తూ తాను రెండో పెళ్లి చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లి వెంకటేశ్వరాలయంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం, 20 మంది కుటుంబీకులు, స్నేహితుల మధ్య గత రాత్రి నిరాడంబరంగా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దిల్ రాజు చేసుకున్నది కులాంతర వివాహం అని తెలుస్తోంది. తనకు చాలా కాలంగా పరిచయం ఉన్న ఓ బ్రాహ్మణ యువతిని ఆయన పెళ్లాడారు. యూఎస్ లో స్థిరపడిన కుటుంబానికి చెందిన ఈమె, ఎయిర్ హోస్టెస్ గానూ పని చేసినట్టు తెలుస్తోంది. కాగా, మూడేళ్ల కిందట దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. వీరికి ఒక కుమార్తె హన్షిత రెడ్డి. 2014లోనే హన్షిత రెడ్డికి వివాహం కాగా.. 2017లో తన తల్లిని కోల్పోయింది. అప్పటి నుంచి తన తండ్రికి రెండో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నారట హన్షిత రెడ్డి. ఈ దిల్ రాజు కూడా తన కూతురు కోరిక మేరకు ఈ వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక వివాహం చేసుకున్న దిల్ రాజుకు టాలీవుడ్ నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.




డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న రేంజ్ కు ఎదిగాడు. ఇక గత ఏడాది సంక్రాంతి కి ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజు.. ఈ ఏడాది కూడా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ తో పాటు పలు ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: