ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 171

తాజ్ మహల్ "చందమామ "
జన్మదిన శుభాకాంక్షలు

కన్ఫామ్.. 'మహేష్' కు జోడిగా 'మహానటి'
ఫైనల్లీ.. కాబోయే భర్తను చూపించిన నిహారిక..!
పలాస హీరో 'కరోనా'పై సినిమా..!
కరోనాపై వేమన పద్యాలు..!
స్టన్నింగ్ లుక్ లో ప్రియా ప్రకాష్ వారియర్
సమంత స్వీట్ మెమొరీస్
నా గురించి రాసే స్కోప్ ఇవ్వను..!

యోగ , వయోలిన్ ప్రాక్టీస్ లో కీర్తి సురేష్

లాక్ డౌన్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటున్న రకుల్..!

ప్రభాస్ అరుదైన రికార్డ్
బీ లోకల్ బీ వోకల్ - అల్లు శిరీష్
బాలీవుడ్ లో చేయకపోవడానికి కారణం అదే..!
స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ?
"నాళైయ తీర్పు "మూవీ తో కోలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విజయ్ తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ "కత్తి ", "తెరి", "మెర్సల్ ", "సర్కార్ ", "బిగిల్ "వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. విజయ్ మక్కల్ అయక్కమ్ (విజయ్ పీపుల్ ఆర్గనైజేషన్ )పేరు తో పలు సేవా కార్యక్రమాలు విజయ్ నిర్వహిస్తున్నారు. అభిమానులు "దళపతి "అని ముద్దుగా పిలుచుకునే విజయ్ నటించిన "మాస్టర్ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా విజయ్ తెలుగుప్రేక్షకులకు పరిచయమే.
పెంగ్విన్ .. లాక్ డౌన్ వేళ మంచి సస్పెన్స్ థ్రిల్లర్
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'పెంగ్విన్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు కరోనా వల్ల థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఈ రోజు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యిందా?లేదా? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

తాజ్ మహల్ "చందమామ "
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ఆగ్రా సిటీ లో యమునా నది ఒడ్డున నిర్మించిన తాజ్ మహల్ 1632 సంవత్సరం లో నిర్మాణం ప్రారంభమై 1648 సంవత్సరంలో పూర్తయింది. మొఘల్ సంస్థాన రాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం నిర్మించిన తాజ్ మహల్ ఒక అద్భుత కట్టడంగా ప్రజలను ఆకట్టుకుంటుంది. న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ వరల్డ్ గా డిక్లేర్ చేయబడిన తాజ్ మహల్ ప్రతీ రోజూ వేలాది సందర్శకులతో విరాజిల్లుతుంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులతో తాజ్ మహల్ ను సందర్శించారు.
జన్మదిన శుభాకాంక్షలు
"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ "చందమామ" మూవీ తో గుర్తింపు పొంది బ్లాక్ బస్టర్ "మగధీర "మూవీ తో స్టార్ హీరోయిన్ గా మారారు. "పళని " మూవీ తో కోలీవుడ్ కు కాజల్ పరిచయం అయ్యారు. పలు తమిళ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ స్టార్ హీరోలతో పలు చిత్రాలలో జోడీ గా నటించిన కాజల్ 50 చిత్రాలకు పైగా నటించారు.

కన్ఫామ్.. 'మహేష్' కు జోడిగా 'మహానటి'
మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న 'సర్కారు వారి పాట' సినిమాలో హీరోయిన్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో గతకొద్ది రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. ముందుగా మహేష్ తో భరత్ అనే నేను చిత్రంలో నటించిన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకుంటున్నారన్న టాక్స్ వినిపించాయి. ఆ తర్వాత ‘దబాంగ్ 2’ ఫేమ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపించాయి. అందులో కూడా నిజం లేదని తెలిసింది. ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేషే నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చాట్ లో మాట్లాడిన కీర్తి ఈ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పకనే…
ఫైనల్లీ.. కాబోయే భర్తను చూపించిన నిహారిక..!
ఫైనల్లీ.. కాబోయే భర్తను చూపించిన నిహారిక..!మొత్తానికి తనకు కాబోయే భర్తను అందరికీ పరిచయం చేసింది మెగా డాటర్ నిహారిక కొణిదల. గతకొద్దికాలంగా నిహారిక పెళ్లి గురించి పలు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. తండ్రి నాగబాబు కూడా త్వరలోనే పెళ్లి చేసేస్తామని చెప్పారు.. తను కూడా ఇంకా తక్కువ టైమే ఉంది అంటూ హింట్స్ ఇస్తూనే ఉంది. ఫైనల్లీ ఇప్పుడు ఆ టైం రానే వచ్చేసింది. నిన్న సోషల్ మీడియాలో మిస్ట్రెస్.. అంటూ.. మొహం కనిపించకుండా క్యూరియాసిటీని పెంచిన నిహారిక... తాజాగా తనకు కాబోయే భర్తను చూపించేసింది. ఈ పోస్ట్ చూసిన తర్వాత సినీ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు కూడా నిహారికకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
'మోసగాళ్ళు' నుండి ఇంట్రెస్టింగ్ పోస్ట్ - అర్థనారీశ్వర అవతారంలో విష్ణు, కాజల్
హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్ళు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటిక విష్ణు, కాజల్ ఫస్ట్, సునీల్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ డిఫరెంట్ గా అందరినీ ఆకట్టుకుంటుంది.
పలాస హీరో 'కరోనా'పై సినిమా..!
ఒకపక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే.. మరోపక్క ఈ వైరస్ పై సినిమాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 'కరోనా వైరస్' అంటూ సినిమా కూడా తీసి దాని ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా రానుంది. ‘అ’ అనే ఓ వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ కరోనా పై సినిమా తెరకెక్కించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసాడు. ఇప్పుడు మరో సినిమా కూడా రాబోతుంది.
కంటతడి పెట్టిస్తున్న 'చిరంజీవి సర్జా' భార్య 'మేఘనా రాజ్' లేఖ..!
కన్నడ యంగ్ హీరో, ‘యాక్షన్ కింగ్’ అర్జున్‌కు మేనల్లుడు, మరో కన్నడ నటుడు ధ్రువ్ సర్జాకు సోదరుడు చిరంజీవి సర్జా ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతి చెందారు. ఇక చిరంజీవి సర్జా మృతితో కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ముఖ్యంగా భార్య మేఘనా రాజ్ కు మాత్రం కోలుకోలేని దెబ్బ. చిరంజీవి సర్జా 2018 మే 2న మేఘనా రాజ్‌ను వివాహమాడారు. పెళ్ళైన రెండేళ్లకే ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరం. ఇక తాజాగా చిరంజీవి సర్జా గురించి సోషల్ మీడియాలో తాను చేసిన పోస్ట్ ఒకటి నెటిజన్లకు కంటతడి పెట్టిస్తుంది. ఆ లేఖ చూస్తుంటే చిరంజీవి సర్జాను తను ఎంతగా ప్రేమించిందో, ఏం కోల్పోయిందో అర్ధమవుతుంది.
కరోనాపై వేమన పద్యాలు..!
నార్మల్ గా ఉండే జీవితాలు కరోనా వల్ల ఒక్కసారిగా మారిపోయాయి. ఒకరికొకరు దగ్గరగా మాట్లాడుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఇక ఈ వైరస్ కు మొదట ప్రజలు భయపడినా ఇప్పుడు మాత్రం కాస్త ఆ భయం తగ్గినట్టుంది. దానికితోడు ప్రభుత్వం కూడా సడలింపులు చేయడంతో ప్రజలు కూడా బయటికి వచ్చేస్తున్నారు. ఇక ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు క్రియేటివిటీతో పోస్ట్లు క్రియేట్ చేస్తుంటే కొందరు ఫన్నీగా క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఎవరి క్రియేటివిటీ వారిది.
స్టన్నింగ్ లుక్ లో ప్రియా ప్రకాష్ వారియర్
"ఒరు అదార్ లవ్ " మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన ప్రియా ప్రకాష్ "శ్రీదేవి బంగళా " మూవీతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఆ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రియా ప్రకాష్ హీరోయిన్ గా రెండవ బాలీవుడ్ మూవీ "లవ్ హ్యాకర్స్" షూటింగ్ ప్రారంభం అయింది. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. "విష్ణుప్రియ "కన్నడ మూవీ తో శాండల్ వుడ్ , నితిన్ హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ తో ప్రియా ప్రకాష్ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
'బిగిల్' ఖాతాలో మరో రికార్డ్ - రెండు యూరోపియన్ కంట్రీస్ లో రిలీజ్..!
అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో గత ఏడాది దీపావళి కి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అట్లీ-విజయ్ కాంబినేషన్ లో మెర్సల్, సర్కార్ సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మూడోసారి వచ్చిన బిగిల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ అందుకున్నారు. అంతేకాదు రూ.200 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ అందుకుంది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది.
సమంత స్వీట్ మెమొరీస్
తెలుగు , తమిళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంటి టెర్రస్ పై గార్డెన్ ఏర్పాటు చేసి సేంద్రియ పద్దతిలో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తున్నారు. సమంత ప్రస్తుతం "ది ఫ్యామిలీ మెన్ 2" వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నా గురించి రాసే స్కోప్ ఇవ్వను..!
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పెంగ్విన్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలింది. రేపు అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న కీర్తి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. నేను ఇప్పుడు ఉన్న ఈ ప్లేస్ లో చాలా హ్యాపీ గా వున్నా... నాకు ఇన్స్పిరేషన్ గా ఉన్న మా పేరెంట్స్ కు.. వారి సపోర్ట్ లేనిదే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు అని తెలిపింది. పెంగ్విన్ సినిమాలో తల్లి పాత్రలో నటిస్తున్నాను.. అలాంటి పాత్రలో నటించాలంటే నాకు ఇష్టం.. ఎందుకంటే పలు ఎమోషన్స్ ను పలికించే అవకాశం ఉంటుంది.. నా పేరెంట్స్…

యోగ , వయోలిన్ ప్రాక్టీస్ లో కీర్తి సురేష్
తెలుగు ,తమిళ , మలయాళ భాషా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ , లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ "మహానటి " మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటిస్తూ కీర్తి బిజీగా ఉన్నారు.

లాక్ డౌన్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటున్న రకుల్..!
లాక్ డౌన్ లో దొరికిన సమయాన్ని హీరో హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఉపయోగించుకుంటున్నారు. దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూనే మరో పక్క తమ వీడియో లతో అభిమానులకు దగ్గరగానే వుంటున్నారు. హీరోలు దాదాపు వర్క్ అవుట్ లు చేస్తూ టైమ్ ను స్పెండ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ అయితే కిచెన్ లో ప్రయాగాలు కూడా చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు చాలా మంది హీరోయిన్స్ వివిధ అంశాలకు సంబంధించి ఆన్ లైన్ లో క్లాసెస్ కు కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు రకుల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ ఈ లాక్‌డౌన్ సమయంలో చేసిన తన ఫిట్ నెస్ కు…

ప్రభాస్ అరుదైన రికార్డ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ రికార్డ్కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తం గా తెలుగు సినిమా సత్తా చాటాయి. "బాహుబలి ", "బాహుబలి 2" మూవీస్ రష్యా ప్రేక్షకులను అలరించాయి. దేశ వ్యాప్తం గానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు అభిమాన గణం పెరిగింది. ప్రభాస్ ఇప్పుడు అరుదైన రికార్డ్ ను స్వంతం చేసుకున్నారు.
బీ లోకల్ బీ వోకల్ - అల్లు శిరీష్
"కొత్త జంట ", "శ్రీరస్తు శుభమస్తు ", "ABCD" వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా "బీ లోకల్ బీ వోకల్" అంటూ ప్రజలకు సందేశం ఇచ్చారు. కరోనా మహమ్మారి కారణం గా దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్న మయిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశీయ ఉత్పత్తులు ప్రోత్సహించి దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టవలసిన బాధ్యత ప్రజలందరికీ ఉంది.
బాలీవుడ్ లో చేయకపోవడానికి కారణం అదే..!
హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సాలిడ్ పాత్రలతో దూసుకుపోతుంది శివగామి అదే రమ్యకృష్ణ. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. శివగామి పాత్రలో ఆమె చేసిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ. బాహుబలి సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్ద బ్రేక్ నే ఇచ్చింది.
'RRR' ట్రయిల్ షూట్ లో ట్విస్ట్.. క్యాన్సిల్ చేసే ఆలోచనలో రాజమౌళి..!
ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను దృష్టిలో పెట్టుకొని.. వాటిని పాటిస్తూ రాజమౌళి ట్రయిల్ షూట్ నిర్వహించడానికి సిద్ధమైనట్టు గత రెండు రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గండిపేట లేదా హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీ సమీపంలో నిర్మించిన సెట్లలో ఈ ట్రయల్ షూట్ జరుగనుందని... ఈ ట్రయల్ షూట్లో మొత్తం 50 మంది సిబ్బందిని మాత్రమే పాల్గొననున్నారని... అంతేకాదు ఈ షూటింగ్ లో తారక్, చరణ్ పాల్గొనడం లేదు. వారికి బదులుగా డూప్ లతో షూట్ ప్లాన్ చేసాడని కూడా అన్నారు. అయితే ఇప్పుడేమైందో తెలియదు కానీ రాజమౌళి తన ట్రయిల్ షూట్ ను క్యాన్సిల్ చేసే ఆలోచనలో వున్నాడట. దీనికి పలు కారణాలే వినిపిస్తున్నాయి. ఒక పక్క ఈ…