ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను దృష్టిలో పెట్టుకొని.. వాటిని పాటిస్తూ రాజమౌళి ట్రయిల్ షూట్ నిర్వహించడానికి సిద్ధమైనట్టు గత రెండు రోజులుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గండిపేట లేదా హైదరాబాద్ శివార్లలోని అల్యూమినియమ్ ఫ్యాక్టరీ సమీపంలో నిర్మించిన సెట్లలో ఈ ట్రయల్ షూట్ జరుగనుందని… ఈ ట్రయల్ షూట్లో మొత్తం 50 మంది సిబ్బందిని మాత్రమే పాల్గొననున్నారని… అంతేకాదు ఈ షూటింగ్ లో తారక్, చరణ్ పాల్గొనడం లేదు. వారికి బదులుగా డూప్ లతో షూట్ ప్లాన్ చేసాడని కూడా అన్నారు. అయితే ఇప్పుడేమైందో తెలియదు కానీ రాజమౌళి తన ట్రయిల్ షూట్ ను క్యాన్సిల్ చేసే ఆలోచనలో వున్నాడట. దీనికి పలు కారణాలే వినిపిస్తున్నాయి. ఒక పక్క ఈ షూటింగ్ కు ఇంకా అనుమతులు రాలేదని.. మరోపక్క కారణం ప్రభుత్వం విధించిన నిబంధనలే కారణం అని తెలుస్తుంది. ఆ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ చేయాలంటే కష్టమే అని భావించిన రాజమౌళి షూటింగ్ ను క్యాన్సిల్ చేసే ఆలోచనలో వున్నాడు అంటున్నారు. చూద్దాం మరి ఇందులో నిజముందో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ సినిమా షూటింగ్‌లకి అనుమతులు వచ్చినా…ఎవరూ షూటింగ్స్ నిర్వహించడం లేదు. కరోనా ప్రభావం తగ్గాకే షూటింగ్స్ ప్రారంభించడం బెటర్ అని మేకర్స్ భావిస్తున్నారట. అయితే రాజమౌళి వేసే ట్రయిల్ షూట్ ను బట్టి కూడా షూటింగ్ కు వెళ్లాలా లేదా అని డిసైడ్ అవ్వొచ్చని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి రాజమౌళి కనుక నిజంగానే ట్రయిల్ షూట్ ను ఆపేస్తే చాలా మంది డైరెక్టర్స్ కూడా వెనకడుగు వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో..
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: