నా గురించి రాసే స్కోప్ ఇవ్వను..!

I Will Never Give A Chance For Others To Write False Stories About My Personal Life Says Actress Keerthy Suresh
I Will Never Give A Chance For Others To Write False Stories About My Personal Life Says Actress Keerthy Suresh

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో పెంగ్విన్ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఒక్క రోజు మాత్రమే మిగిలింది. రేపు అమెజాన్ ప్రైమ్ లో సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొన్న కీర్తి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. నేను ఇప్పుడు ఉన్న ఈ ప్లేస్ లో చాలా హ్యాపీ గా వున్నా… నాకు ఇన్స్పిరేషన్ గా ఉన్న మా పేరెంట్స్ కు.. వారి సపోర్ట్ లేనిదే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు అని తెలిపింది. పెంగ్విన్ సినిమాలో తల్లి పాత్రలో నటిస్తున్నాను.. అలాంటి పాత్రలో నటించాలంటే నాకు ఇష్టం.. ఎందుకంటే పలు ఎమోషన్స్ ను పలికించే అవకాశం ఉంటుంది.. నా పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి నేను ఈ పాత్రను చూసాను.. మా అమ్మ నన్ను చూసుకున్న విధానం బట్టి నేను ఈ పాత్రలో నటించాను.. ఒక రకంగా ఈ పాత్ర చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసింది అని చెప్పుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు ఇండస్ట్రీల్లో అవకాశాలు అందుకోవడం పై కూడా తాను మాట్లాడుతూ.. నేను కావాలని చేసిన ప్రయత్నం కాదు..కానీ పలు ఇండస్ట్రీలనుండి అవకాశాలు రావడం మాత్రం నా అదృష్టంగా భావిస్తున్నా అని తెలిపింది. ఎప్పుడూ ప్రెషర్ ఫీల్ అవుతూనే ఉంటా…అయితే నా సైడ్ నుండి ప్రతిసారీ బెటర్ ఇవ్వడానికి చూస్తా.. సక్సెస్ అనేది మంచి అవకాశాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.. దానితో పాటు రెస్పాన్సిబిలిటీ ని కూడా పెంచుతుంది.. ప్రతి సినిమా నుండి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటా అని తెలిపింది.

తన కో స్టార్స్ తో లింకప్స్ గురించి కూడా స్పందిస్తూ… ఎందుకంటే నా గురించి రాయడానికి అక్కడ ఏం లేదు.. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడే ఇలాంటివి రాకూడదని అనుకున్నా.. అందుకే అలాంటి వార్తలు రాకుండా ఉండటానికి ట్రై చేస్తా.. అంతేకాకుండా ముందు నాలా నేను ఉండటానికి ఇష్టపడతా అని తెలిపింది.

ఇక ప్రస్తుతం ఈ అమ్మడు పలు సినిమాలతో బిజీగా వుంది. అయితే లాక్ డౌన్ వల్ల కుటుంబ సభ్యులతో టైం గడుపుతుంది. అంతేకాదు ఇప్పుడప్పుడే షూటింగ్ వచ్చే అవకాశాలు లేదని చెప్పేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + seventeen =