లాక్ డౌన్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటున్న రకుల్..!

Actress Rakul Preet Singh Makes The Perfect Use Of Her Lockdown Time
Actress Rakul Preet Singh Makes The Perfect Use Of Her Lockdown Time

లాక్ డౌన్ లో దొరికిన సమయాన్ని హీరో హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఉపయోగించుకుంటున్నారు. దొరికిన ఈ ఖాళీ సమయాన్ని కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతూనే మరో పక్క తమ వీడియో లతో అభిమానులకు దగ్గరగానే వుంటున్నారు. హీరోలు దాదాపు వర్క్ అవుట్ లు చేస్తూ టైమ్ ను స్పెండ్ చేస్తున్నారు. ఇక హీరోయిన్స్ అయితే కిచెన్ లో ప్రయాగాలు కూడా చేయడం మొదలు పెట్టారు. అంతే కాదు చాలా మంది హీరోయిన్స్ వివిధ అంశాలకు సంబంధించి ఆన్ లైన్ లో క్లాసెస్ కు కూడా జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు రకుల్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉండే హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ లాక్‌డౌన్‌ సమయంలో చేసిన తన ఫిట్ నెస్ కు సంబంధించిన వర్క్ ఔట్స్ కు సంబంధించి.. యోగాసనాలకు సంబంధించి వీడియోస్ ను పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అది కూడా అమ్మడికి లాభమే. తనే తన జిమ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ప్రమోట్ చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మూడు నెలలు ముంబై లోనే వుండిపోయిన ఈ భామ ఫైనల్లీ ఢిల్లీలోని తన సొంత ఇంటికి చేరింది. లాక్ డౌన్ వల్ల దాదాపు మూడు నెలలు ముంబై లోనే ఇరుక్కుపోయింది. ఇప్పుడు దాదాపు 6 నెలలు తర్వాత రకుల్ ఇంటికి చేరింది. ఇక అక్కడ కూడా షూటింగ్ లో పాల్గొంటూనే.. తన యూ ట్యూబ్ ఛానల్ కు వర్కౌట్స్ కు సంబంధించి వీడియోస్ చేస్తూనే మరో పక్క ఆన్ లైన్ లో ఎంబీఏ క్లాసెస్ లో జాయిన్ అయినట్టు తెలిపింది. అంతే కాదు ట్రేడ్ అనాలసిస్, మెరైన్ ఇంజనీరింగ్ కు సంబంధించిన విషయాలు గురించి కూడా తెలుసుకుంటుందట. మొత్తానికి చూడబోతే రకుల్ ఖాళీ సమయాన్ని బాగానే ఉపయోగించుకుంటున్నాట్టు ఉంది.

ఇక సినిమాల విషయానికొస్తే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ జోరు ఈ మధ్యన కాస్త తగ్గింది.ఈ మధ్యే విడుదలైన మన్మథుడు 2 ప్లాప్ అవ్వడం.. కొత్త హీరోయిన్స్ స్పీడ్ మీద ఉండటంతో కాస్త అవకాశలు తగ్గాయి. తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. వీటితోపాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటించడానికి ఈ భామ ఇంట్రెస్ట్ చూపుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 7 =