బాలీవుడ్ లో చేయకపోవడానికి కారణం అదే..!

Tollywood Veteran Actress Ramya Krishnan Reveals The Reason Behind Not Doing Bollywood Movies

హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగి.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సాలిడ్ పాత్రలతో దూసుకుపోతుంది శివగామి అదే రమ్యకృష్ణ. బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో ఎంట్రీ ఇచ్చి మరోసారి తన రేంజ్ ను మార్చేసింది రమ్యకృష్ణ. శివగామి పాత్రలో ఆమె చేసిన నటనకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. బాహుబలి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస ఆఫర్స్ తో దూసుకుపోతుంది రమ్యకృష్ణ. బాహుబలి సినిమా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ కి పెద్ద బ్రేక్ నే ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఈ సినిమాలో విజయ్ కు కూడా తల్లిగా రమ్యకృష్ణ నటిస్తుంది. దీనితోపాటు కన్నడ, తమిళ్, మలయాళం సినిమాల్లో కూడా వరుస సినిమాలతో బిజీగా వుంది.

ఇక ఇదిలా ఉండగా దక్షిణాదిన సినిమాలతో దూసుకుపోయిన రమ్యకృష్ణ ఉత్తరాదిన సినిమాలకు దూరమవడానికి కారణం తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో రమ్యకృష్ణను బాలీవుడ్ గురించి అడుగగా.. `క్రిమినల్`, `కల్‌నాయక్`, `బడేమియా చోటేమియా` వంటి హిందీ సినిమాల్లో నటించాను… అయితే ఆ సినిమాలు అంత పెద్దగా విజయం సాధించలేదు.. ఆ తర్వాత ఒకటి రెండు అవకాశాలు వచ్చినా అవి పెద్దగా నచ్చలేదు.. దాంతో బాలీవుడ్‌కు దూరమయ్యాను అని చెప్పుకొచ్చింది. అయితే దక్షిణాదిన మాత్రం ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశానని రమ్యకృష్ణ తెలిపారు. మరి ఒకవేళ బాలీవుడ్ లో కనుక బిజీ అయి ఉండుంటే.. ఇక్కడ నీలాంబరి లాంటి పాత్రలు మిస్సయ్యేవాళ్ళవేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =