జన్మదిన శుభాకాంక్షలు

Wishing Kajal Aggarwal a Very Happy Birthday

“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ “చందమామ” మూవీ తో గుర్తింపు పొంది బ్లాక్ బస్టర్ “మగధీర “మూవీ తో స్టార్ హీరోయిన్ గా మారారు. “పళని ” మూవీ తో కోలీవుడ్ కు కాజల్ పరిచయం అయ్యారు. పలు తమిళ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ స్టార్ హీరోలతో పలు చిత్రాలలో జోడీ గా నటించిన కాజల్ 50 చిత్రాలకు పైగా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కాజల్ అగర్వాల్ కు బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులతో పాటు హీరోయిన్స్ తమన్నా , రకుల్ ప్రీత్ , కీర్తి సురేష్ , మెహరీన్ , అంజలి , ప్రణీత , నిధి అగర్వాల్ , ఈషా రెబ్బా , ప్రభాస్ ఫ్యాన్స్ , అల్లు అర్జున్ ఫ్యాన్స్ , అజిత్ ఫ్యాన్స్ కాజల్ కు బర్త్ డే శుభాకాంక్షలు అందజేశారు. #HBD Kajal Agarwal ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “, “ఇండియన్ 2″(తమిళ ), ముంబై సాగ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో మైనపు ప్రతిమ కొలువుతీరడం కాజల్ కు దక్కిన అరుదైన గౌరవం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.