పెంగ్విన్ .. లాక్ డౌన్ వేళ మంచి సస్పెన్స్ థ్రిల్లర్

Keerthy Suresh's Penguin Telugu Movie Review

ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘పెంగ్విన్’. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాదు కరోనా వల్ల థియేటర్స్ మూతపడటంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను ఈ రోజు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యిందా?లేదా? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: కీర్తి సురేష్, ఆదిదేవ్, లింగ, మాస్టర్ అద్వైత్, హరిణి, నిత్య తదితరులు
దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్
నిర్మాతలు: కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం: సంతోష్ నారాయణ్
కెమెరా: కార్తీక్ పళని

కథ..

రిథమ్ (కీర్తి సురేష్) కు అజయ్ (అద్వైత్) అనే ఒక కొడుకు ఉంటాడు. అయితే ఒకరోజు ఆడుకోడానికి వెళ్లిన అజయ్ కనిపించకుండా పోతాడు. కొడుకు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకొని షాక్ తింటుంది. దాదాపు సంవత్సరంపాటు తన కొడుకు కోసం వెతుకుతూనే ఉంటుంది. ఆ క్రమంలో మానసికంగా ఎంతో కృంగిపోతుంది. ఎమోషనల్ గా డిస్టర్బ్ అవుతుంది. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు అజయ్‌ తిరిగి వస్తాడు. కానీ అజయ్‌కు అపాయం తలపెట్టేందుకు చాప్లిన్ వేషంలో ఉన్న వ్యక్తి వెంటాడుతూనే ఉంటాడు. తన బిడ్డ అజయ్‌ను ఎవరు, ఎందుకు వెంటాడుతున్నారనే విషయాన్ని కనుక్కునేందుకు రిథమ్ ప్రయత్నిస్తుంటుంది.. చాప్లిన్ మాస్క్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరనే తెలుసుకోవడానికి ప్రాణాలకు తెగిస్తుంది. మరి రిథమ్‌పై చాప్లిన్ మాస్క్ ధరించిన వ్యక్తి ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు . చాప్లిన్ మాస్క్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? రిథమ్ వాటన్నిటిని ఎలా ఛేదిస్తుంది అన్నది పెంగ్విన్ కథ..

విశ్లేషణ..

థ్రిల్లర్ మూవీస్.. అది సస్పెన్స్ థ్రిల్లర్.. సైకో థ్రిల్లర్ ఏదైనా కానీ వాటికీ ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుంది. మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. ప్రేక్షకుడిని కాస్త ఎంగేజ్ చేస్తే చాలు సినిమా హిట్ అయినట్టే. అలాంటి సస్పెన్స్ అండ్ సైకో థ్రిల్లర్ నేపథ్యంలోనే పెంగ్విన్ సినిమా తెరెకెక్కింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ ముందే పాయింట్ ను చెప్పేసి కథలో ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాడు. విషయాన్ని సూటిగా చెప్తూనే సస్పెన్స్ ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో బాబు కిడ్నాప్ అవ్వడం.. కీర్తి సురేష్ వెతకడం.. ఆ తర్వాత మళ్ళీ బాబు దొరకడం చూపించారు. అయితే కొడుకు దొరికిన తరువాత మరికొన్ని అనుమానాలు క్రియేట్ అవుతాయి. ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారు అనే అనుమానం కలుగుతుంది. కిడ్నాప్ కారణాలు, కిడ్నాప్ చేసిన వ్యక్తికీ సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా సెకండ్ హాఫ్ లో రివీల్ చేశారు. మెయిన్ థీమ్ మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం బాగుంది.

ఇక కీర్తి సురేష్ థ్రిల్లర్ జానర్లో చేసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాకు ప్రధాన బలం కీర్తి సురేష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రిథమ్ గా కీర్తి సురేష్ తన పాత్రకు తగ్గట్లు… తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మెయిన్ గా కొడుకు మిస్ అయ్యాక వెతికే సన్నివేశాల్లో .. కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి కీర్తి చేసే ప్రయత్నం.. అలాగే ఆమె పలికించిన హావభావాలు చాలా బాగున్నాయి. గర్భవతిగా తన ప్రాణాలు లెక్క చేయకుండా మరి ముసుగు వేసుకున్న వ్యక్తిని కీర్తి తెలుసుకోవాలని చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. ఇక అజయ్ పాత్రలో చేసిన అద్వైత్ కూడా బాగా నటించాడు. ఇక మిగిలిన వారు తమ పాత్రల మేరకు బాగానే నటించారు.

ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్స్ సినిమాటోగ్రఫి మ్యూజిక్. సినిమా విజువల్ చాలా ఆకట్టుకునేలా ఉన్నాయి. కెమెరా పనితనం చాలా బావుంది. సినిమాను కలర్‌ఫుల్‌గా మార్చడంలో కార్తీక్ పళని సక్సెస్ అయ్యారు. థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం అని చెప్పాలి. ఇక సినిమాకు సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. సంతోష్ నారాయణ్ అద్భుతంగా మ్యూజిక్ అందించాడు.

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఆ లాక్ డౌన్ లో థియేటర్స్ లేవు కాబట్టి ఈ టైంలో ఈ సినిమా చూసి మంచి థ్రిల్ ను పొందొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.