ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 170
రానా వివాహానికి వేదిక ఖరారు..!
కింగ్ నాగార్జున కు జోడీగా ఇలియానా ?
రేణు దేశాయ్ రీ ఎంట్రీ
ఆమె బయోపిక్ లో నటించాలని ఉంది..!

"చెఫ్ పూజా "
నితిన్ పెళ్లి విషయంలో మార్పు..!

"అన్నాత్తే " మూవీ విశేషాలు
విజయ్ తో నటించట్లేదు..!
రష్మిక షార్ట్ స్టోరీ -2
బ్లాక్ &వైట్ ఫొటో లో రకుల్ ప్రీత్

నితిన్ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్..!
'ఫైటర్' ఒరిజినల్ టైటిల్ పై అప్ డేట్ ..!

నాక్కూడా విసుగ్గా ఉంది... బోర్ కొడుతోంది..!

న్యూ లుక్ లో అనసూయ

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ డైరెక్టర్ మృతి

లాక్ డౌన్ సమయంలో నభా నటేష్

"#Prabhas 21"మూవీ కి హాలీవుడ్ టీమ్

12 ఏళ్ల 'రెడీ' - ఎప్పుడూ స్పెషలే
పెళ్ళికి ముందే సినిమా పూర్తి..!
మొత్తానికి నిహారిక కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. నిన్ననే తనకు కాబోయే భర్తను సోషల్ మీడియా వేదికగా అందరికీ పరిచయం చేసింది. ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిహారిక చేసుకోబోయే చైతన్య అయితే ఒక్కరోజులో ఫేమస్ అయిపోయాడు. అంతేకాదు హీరోకి కాబోయే అన్ని లక్షణాలు ఉన్నాయంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు అందరూ.
రానా వివాహానికి వేదిక ఖరారు..!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరైన రానా పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. డిసెంబర్ లో పెళ్లి అనుకున్నారు.. కానీ ఆగష్ట్ 8 వ తేదీన పెళ్లి డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో రానా - మిహీకా ల పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయట. ముందు వీరి పెళ్లి రామానాయుడు స్టూడియోస్ లో చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఇరు కుటుంబసభ్యులు మాట్లాడుకొని ఫైనల్ మరో వేదికను నిర్ణయించుకున్నారట.
కింగ్ నాగార్జున కు జోడీగా ఇలియానా ?
కింగ్ నాగార్జున ప్రస్తుతం నూతన దర్శకుడు సోలోమెన్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున ఇప్పుడు రెండు సినిమాలను లైన్ లో పెట్టారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ "సోగ్గాడే చిన్ని నాయనా " మూవీ సీక్వెల్ "బంగార్రాజు", మరొకటి సక్సెస్ ఫుల్ "గరుడవేగ" మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందే మూవీ. అజయ్ దేవగన్ హీరోగా రూపొందిన యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ బ్లాక్ బస్టర్ "రైడ్ " బాలీవుడ్ మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందనుంది. "రైడ్ " బాలీవుడ్ మూవీ లో హీరోయిన్ గా నటించిన ఇలియానా ను తెలుగు వెర్షన్ కు కూడా ఎంపిక చేయాలని ప్లాన్ చేసి ఆమె తో సంప్రదింపులు జరుపుతున్నట్టు…
రేణు దేశాయ్ రీ ఎంట్రీ
యాక్ట్రెస్ , ఎడిటర్ , కాస్ట్యూమ్స్ డిజైనర్ , ప్రొడ్యూసర్, డైరెక్టర్ రేణు దేశాయ్ "బద్రి ", "జానీ "," జేమ్స్ పాండు " (తమిళ) మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "ఇష్క్ వాలా లవ్ "మరాఠీ మూవీ దర్శకత్వం వహించి , నిర్మించారు. మోస్ట్ ట్యాలెంటెడ్ రేణు దేశాయ్ తెలుగు మూవీ కి కూడా దర్శకత్వం వహిస్తానని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 18 సంవత్సరాల తరువాత నటించాలనే నిర్ణయం రేణు తీసుకున్నారు.
ఆమె బయోపిక్ లో నటించాలని ఉంది..!
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. ఇక ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతి తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట చేసింది.

"చెఫ్ పూజా "
పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించిన పూజాహెగ్డే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. "Prabhas 20", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్న పూజాహెగ్డే మరో తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూజాహెగ్డే నటించిన బాలీవుడ్ మూవీ "హౌస్ ఫుల్ 4"ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ స్టార్ హీరోస్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
నితిన్ పెళ్లి విషయంలో మార్పు..!
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో నితిన్ కూడా ఉంటాడు. అయితే ఈ ఏడాది ఆ లిస్ట్ నుండి బయటకి రాబోతున్నాడు. నితిన్ కు, షాలినితో వివాహం జరగబోతున్న సంగతి తెలసిందే. నితిన్, షాలినికి 2012లోనే పరిచయం ఏర్పడింది. స్నేహంతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చింది. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగింది. పరిస్థితులు అన్ని బావుంటే ఏప్రిల్ 16నే వీరి వివాహానికి ముహూర్తం పెట్టారు. కానీ కరోనా వల్ల పెళ్లి వాయిదా పడింది. ఇక పరిస్థితులు చక్కబడిన తర్వాత ఏడాది చివరిలో చేద్దామని ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడప్పుడే కరోనా ప్రభావం తగ్గే పరిస్థితి లేదు. రోజు రోజుకు కేసులు కూడా…

"అన్నాత్తే " మూవీ విశేషాలు
టాలీవుడ్ , కోలీవుడ్ లలో సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి తెలుగు , తమిళ , మలయాళ భాష చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా కీర్తి నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కీర్తి అభిమానులను అలరిస్తున్నారు. పలు కొత్త మూవీస్ ఆఫర్స్ అందుకుంటున్నారు.
విజయ్ తో నటించట్లేదు..!
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది 'ఛలో' భామ రష్మిక మందన. 'ఛలో', 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరూ', రీసెంట్ గా వచ్చిన 'భీష్మ' సినిమాలతోవరుస హిట్స్ తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే రష్మిక చేతిలో పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం రష్మిక సుకుమార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప' సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా విభిన్నమైన యాస కూడా నేర్చుకుంటుంది. కన్నడలోనూ వరుస సినిమాలలో నటిస్తోంది. తమిళ్ లో కూడా కార్తికి జోడీగా ఓ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది రష్మిక.
రష్మిక షార్ట్ స్టోరీ -2
సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక నటించిన "సరిలేరు నీకెవ్వరు ", "భీష్మ" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. "సుల్తాన్ "తమిళ మూవీ తో కోలీవుడ్ లో అడుగు పెడుతున్నారు. కన్నడ మూవీస్ లో కూడా నటిస్తున్న రష్మిక లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయ్యారు.
బ్లాక్ &వైట్ ఫొటో లో రకుల్ ప్రీత్
తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకులను అలరించారు. రకుల్ ప్రీత్ నటించిన బాలీవుడ్ మూవీస్" దే దే ప్యార్ దే ", "మర్జావాన్ " ఘనవిజయం సాధించడంతో బాలీవుడ్ లో బిజీగా మారారు. రకుల్ ప్రస్తుతం "ఎటాక్ ", "ఛలే ఛలో "(హిందీ) , "ఇండియన్ 2", "అయిలాన్ " (తమిళ్ ), నితిన్ హీరోగా రూపొందుతున్న తెలుగు మూవీ లలో నటిస్తున్నారు.

నితిన్ కోసం హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్..!
చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని 'భీష్మ' సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు నితిన్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన కిక్ తో వరుసగా ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టేసాడు. చంద్రశేఖర్ యేలేటి, 'ఛల్ మోహన్ రంగా' చేసిన కృష్ణచైతన్యతో అలాగే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో అంధాదున్ రీమేక్ చేస్తున్నాడు నితిన్.
'ఫైటర్' ఒరిజినల్ టైటిల్ పై అప్ డేట్ ..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. ఇక కరోనా వల్ల ప్యాకప్ చెప్పుకొని ఇక్కడికి వచ్చేసారు. మరి షూటింగ్ కు ఎప్పుడు వెళ్తారు అనేది మాత్రం ఇంకా తెలీదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా టైటిల్ ఫైటర్ కాదని ఇప్పటినే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫైటర్ అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. అసలైన టైటిల్ వేరే ఉందని ఇంతకుముందే తెలిపింది.

నాక్కూడా విసుగ్గా ఉంది... బోర్ కొడుతోంది..!
లాక్ డౌన్ వల్ల ప్రభుత్వాలు సడలింపులు చేయగా కొంతమంది తమ పనులకు వెళ్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీకి మాత్రం ఇంకా మంచి రోజులు రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా.. అన్ని నిబంధనలతో షూట్ చేయడానికి పెద్దగా ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ధైర్యం చేసి రాజమౌళి ట్రయిల్ షూట్ చేద్దామని రంగంలోకి దిగాడు కానీ.. రాజమౌళి చేతులెత్తేసినట్టు వార్తలు వచ్చాయి ఇప్పటికే. దీనితో జులై ఎండింగ్ వరకూ ఆగాల్సిందే. అయితే దీనివల్ల సినీ కార్మికులకు మాత్రం ఇబ్బందే అని చెప్పొచ్చు. షూటింగ్ లు మొదలైతే కాస్త కోలుకోవచ్చని అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇక ఈ నేపద్యంలో సినీ కార్మికులకు సీసీసీ అండగా ఉంటుందని…
ఖైదీ సీక్వెల్ కు సిద్ధమవుతున్న కార్తీ - లోకేష్..!
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అవ్వనుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. కన్నడలో కూడా ఈ సినిమా రీమేక్ కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కన్నడ రీమేక్ వెర్షన్ లో శాండిల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన…

న్యూ లుక్ లో అనసూయ
బుల్లితెరపై సక్సెస్ ఫుల్ యాంకర్ గా రాణిస్తున్న అనసూయ భరద్వాజ్ తన ఆసక్తికర యాంకరింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్న అనసూయ బ్లాక్ బస్టర్ "రంగస్థలం" మూవీ లో రంగమ్మత్త క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. "యాత్ర ", "కథనం " మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.

‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ డైరెక్టర్ మృతి
2020 సినీ పరిశ్రమకు అస్సలు కలిసిరాలేదని ఇప్పటికే పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. చూడబోతే అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే పలు సినీ ఇండస్ట్రీల నుండి పలువురు సినీ ప్రముఖులు వరుసగా మృతి చెందుతున్నారు. ఇటీవలే కన్నడ పరిశ్రమకు చెందిన యంగ్ హీరో చిరంజీవి సర్జా మృతి చెందగా.. అది మరిచిపోయేలోపే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సింగ్ ఇప్పుడు మలయాళ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు మృతి చెందాడు. మలయాళ దర్శక నిర్మాత కె.సచిదానంద్(సచి) గుండెపోటుతో కన్నుమూశారు. ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్న ఆయనకు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ తర్వాత గుండెపోటు రావడంతో ఆయన్ని…

లాక్ డౌన్ సమయంలో నభా నటేష్
బ్లాక్ బస్టర్ "ఇస్మార్ట్ శంకర్ " మూవీతో గుర్తింపు పొందిన కన్నడ బ్యూటీ నభా నటేష్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నభా నటేష్ ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా రూపొందుతున్న "సోలో బ్రతుకే సో బెటర్ ", బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న "అల్లుడు అదుర్స్ " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ రెండు మూవీస్ షూటింగ్స్ నిలిచిపోయాయి. 3 నెలలు గా నభా నటేష్ తన స్వంత రాష్ట్రం కర్ణాటక లో ఇంటికే పరిమితం అయ్యారు.

"#Prabhas 21"మూవీ కి హాలీవుడ్ టీమ్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్ టైనర్"Prabhas 20" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణం గా జార్జియా దేశంలో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. ఆ బ్యాలెన్స్ షూటింగ్ ను హైదరాబాద్ లో జార్జియా బ్యాక్ డ్రాప్ లో సెట్ రూపొందించి చిత్రీకరణ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ఈ మూవీ తరువాత మరో మూవీ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

12 ఏళ్ల 'రెడీ' - ఎప్పుడూ స్పెషలే
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్, జెనీలియా హీరో హీరోయిన్లుగా 2008లో వచ్చిన రెడీ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో కామెడీలోనే కొత్త ఒరవడి తీసుకొచ్చాడు శ్రీను వైట్ల. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. దీనికి తోడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం మరో ఆకర్షణ. ఆడియో కూడా సూపర్ హిట్. ఇప్పటికే రెడీ సినిమాలో సాంగ్స్ వినే వారు వుంటారు. అటు రామ్ కు, జెనిలీయాకు ఇటు డైరెక్టర్ శ్రీనువైట్లకు కూడా ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్. ఇక ఈ సినిమా రిలీజ్ అయి ఈ రోజుతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రామ్ సోషల్ మీడియా ద్వారా…