ఒకపక్క కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే.. మరోపక్క ఈ వైరస్ పై సినిమాలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ‘కరోనా వైరస్’ అంటూ సినిమా కూడా తీసి దాని ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ఇక ఇప్పుడు మరో సినిమా కూడా రానుంది. ‘అ’ అనే ఓ వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ కరోనా పై సినిమా తెరకెక్కించనున్నాడు. ఇక ఈ సినిమా ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేసాడు. ఇప్పుడు మరో సినిమా కూడా రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘పలాస 1978’తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్. రక్షిత్ హీరోగా కరోనాపై సినిమా చేయబోతున్నాడు. ‘ఐ యామ్ గొన్నా టెల్ గాడ్ ఎవ్రీథింగ్’ వంటి వైవిధ్యమైన హాలీవుడ్ షార్ట్ ఫిల్మ్‌తో విమర్శకుల ప్రశంసలతో పాటు అంతర్జాతీయ గుర్తింపు పొందిన దేవ్ పిన్నమరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకు ‘డబ్ల్యూహెచ్ఓ’ అనే టైటిల్‌ని నిర్ధారించారు. కరోనా వైరస్ వెనక ఎలాంటి కుట్ర జరిగిందనే నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. హ్యాకింగ్ బ్యాక్ డ్రాప్‌లో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రానున్న ఈ మూవీని సుధాస్ మీడియా సమర్పణలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భారీ స్థాయిలో నిర్మించబోతుంది. హీరో రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని అతని లుక్‌ని చిత్రయూనిట్ విడుదల చేసింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: